బాతుగుడ్లు తినడం ఆరోగ్యానికి మంచిదేనా?

Samatha

12 july  2025

Credit: Instagram

గుడ్డు ఆరోగ్యానికి చాలా మంచిది. కానీ గుడ్డు అందరికీ కోడి గుడ్లే గుర్తు వస్తాయి కానీ, బాతు గుడ్లు కూడా అనేక పోషకాలు ఉంటాయంట.

కానీ చాలా మంది కోడి గుడ్లు మాత్రమే ఎక్కువగా తింటుంటారు. మరి బాతు గుడ్లు తినడం ఆరోగ్యానికి మంచిదేనా? కాదో ఇప్పుడు తెలుసుకుందాం.

బాతు గుడ్లు ఆరోగ్యానికి చాలా మంచిదంట. కోడి గుడ్లను మించిన ప్రోటీన్ ఇందులో ఉంటుందంట. అందువలన ప్రతి ఒక్కరూ వీటిని తినాలంట.

ఒక బాతు గుడ్డులో దాదాపు శరీరానికి రోజూ వారీ ప్రోటీన్‌లో 18 శాతం లభిస్తుందంట. కోడి గుడ్డులో 6శాతం ప్రోటీన్ ఉంటే, బాతు గుడ్డులో 9 గ్రాముల ప్రోటీన్ ఉంటదంట.

కోడి గడ్డు తినడం వలన ఇవి గుండె ఆరోగ్యాన్ని పెంచడమే కాకుండా, తెలివితేటలు, జ్ఞాపకశక్తిని పెంచుతాయంటున్నారు నిపుణులు.

బాతు గుడ్లు ఎముకల ఆరోగ్యానికి చాలా మంచిదంట. వీటిలో విటమిన్స్, ఖనిజాలు ఎముకలను దృఢంగా తయారు చేస్తాయంటున్నారు నిపుణులు.

కంటి సమస్యలు ఉన్న వారు ప్రతి రోజూ ఒక బాతు గుడ్డు తినడం వలన ఇది కంటి ఆరోగ్యానికి మేలు చేస్తుందంట.

బాతు గుడ్డులో విటమిన్ ఎ ఎక్కువ మోతాదులో ఉంటుంది. అందువలన ఇది రోగనిరోధక శక్తిని పెంచి ఆరోగ్యాన్ని కాపాడుతుందంట.