ప్రాణం పైలం.. మటన్ తిన్న తర్వాత ఇవి తింటే కథ కంచికే..!
samatha
12 JUN 2025
Credit: Instagram
ఎంతోమంది ఇష్టంగా నాన్ వెజ్‌ను తింటుంటారు. వారానికి ఒక్కసారైనా సరే చికెన్ లేదా మటన్ తినడానికి ఎక్కువ ఆసక్తి చూపిస్తుంటారు.
చికెన్ లేదా మటన్ శారీరక అభివృద్ధికి చాలా ఉపయోగపడుతాయి. ముఖ్యంగా చికెన్‌లో ఉండే ప్రోటిన్ కండరాల పెరుగుదలకు ఉపయోగపడుతుంది.
అయితే ఈ చికెన్ లేదా మటన్ తిన్న తర్వాత అస్సలే కొన్ని ఆహార పదార్థాలను తీసుకోకూడదంటున్నారు ఆరోగ్య నిపుణులు. కాగా, అవి ఏవో తెలుసుకుందాం
మటన్‌లో కొవ్వులు అధికంగా ఉంటాయి. అయితే చాలా మంది మటన్ తిన్న తర్వాత శీతల పానీయాలు తాగడానికి ఆసక్తిచూపుతారు.
కానీ మటన్ తిన్న తర్వాత అస్సలే కూల్ డ్రింక్స్ లాంటివి తాగకూడదంట. వీటిని తీసుకోవడం వలన మటన్‌లోని కొవ్వు గడ్డకట్టుకొని, శరీరంలో పేరుకపోతుందంట.
అదే విధంగా మటన్ తిన్న తర్వాత తేనె లేదా పాలు, టీ అస్సలు తీసుకూకోడదంటున్నారు నిపుణులు, ఒక వేళ ఇవి తీసుకుంటే అవి విషపూరితంగా మారుతాయంట. కొన్ని సార్లు ప్రాణానికే ముప్పు వాటిల్లే ఛాన్స్ ఉంటుందంట.
మటన్ లేదా చికెన్ తిన్న తర్వాత పాలు, పాల ఉత్పత్తులతో తయారు చేసిన స్వీట్స్ అస్సలే తీసుకోకూడదంట. దీని వలన జీర్ణ సమస్యలు వస్తాయని హెచ్చరిస్తున్నారు నిపుణులు.
అదేవిధంగా నాన్ వెజ్ తిన్న తర్వాత అస్సలే తేనె తీసుకోకూడదంట. ఇది మటన్, చికెన్ లాగానే శరీరంలో వేడి పెంచుతుందంట. కొన్ని సార్లు ఇది చాలా ప్రమాదకరంగా ఉంటుందంట.