సైలెంట్ కిల్లర్.. అన్న వాహిక క్యాన్సర్ ప్రారంభ లక్షణాలు ఇవే!

12 September 2025

Samatha

రోజు రోజుకు క్యాన్సర్ అనేది చాలా వేగంగా విస్తరిస్తుంది. చాలా మంది దీని బారిన పడి ప్రాణాలు కోతున్నారు. అందుకే క్యాన్సర్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలంటున్నారు వైద్యులు.

అయితే ఇప్పుడు మనం అన్నవాహిక క్యాన్సర్ ఉంటే ఎలాంటి లక్షణాలు కనిపిస్తాయి. దీని ప్రారంభ లక్షణాల గురించి విరంగా తెలుసుకుందాం.

అన్న వాహిక క్యాన్సర్ ఉంటే తరచూ గొంతు నొప్పి సమస్యలు వస్తాయంట. అంతే కాకుండా కొన్నిసార్లు ఆహారం తినడంలో కూడా ఇబ్బంది కలుగుతుంది.

అలాగే గొంతు బొంగురు పోవడం, లేదా వాయిస్ మారడం, మింగడంలో ఇబ్బంది వంటి లక్షణాలు కనిపిస్తాయంట

ఇవే కాకుండా అన్నవాహిక క్యాన్సర్ ఉంటే, ఛాతి నొప్పి లేదా యాసిడ్ రిఫ్లక్స్ మంట, గొంతులో ఆహారం జిగటగా మారడం జరుగుతుంది.

అలాగే అతిగా బరువు తగ్గడం, రక్తంలో ఛాతి ఒత్తిడితో వాంతులు వంటి లక్షణాలు అన్నవాహిక క్యాన్సర్ ఉన్నవారిలో కనిపిస్తాయంట.

ఇది ఎక్కువగా సరైన ఆహారం తీసుకోకపోవడం, తరచుగా వేడి వేడి పానీయాలు, మద్యం, ధూమపానం వంటి వాటి  వలన వస్తుందంట.

నోట్ : పై సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా ఇవ్వబడినది  మాత్రమే టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు.