మాంసం ఎక్కువ తినే దేశాలు ఇవే.. మరి మన భారత్ ఏ స్థానంలో ఉన్నదంటే?
Samatha
29 october 2025
నాన్ వెజ్ ఇష్టపడని వారు ఎవరుంటారు చెప్పండి. చాలా మంది ఎంతో ఇష్టంగా నాన్ వెజ్ తింటారు. కొందరైతే ముక్కలేనిదే ముద్ద దిగదని చెబుతుంటారు. అంతలా ఇష్టపడుతుంటారు.
ఇక చాలా మంది మటన్, చికెన్‌లను ఇష్టంగా తింటారు. మరి అసలు ప్రపంచంలో ఏ దేశంలో ఎక్కువ మంది నాన్ వెజ్ తింటారు అనే డౌట్ చాలా మందిలో ఉంటుంది.
కాగా, ఇప్పుడు మనం ప్రపంచంలో మాంసాహారం తినే దేశాల్లో టాప్ లో ఏవి ఉన్నాయి. మన భారత దేశం నాన్ వెజ్ విషయంలో ఏ స్థానంలో ఉందో ఇప్పుడు తెలుసుకుందాం.
స్టాటిస్టా రిసెర్ట్స్ డిపార్ట్ మెంట్ ఐక్యరాజ్య సమితికి చెందిన ఆహార వ్యవసాయ సంస్థ ఓ సర్వే చేసి, ఓ రిపోర్ట్ వెళ్లడించింది. అందులో మాంసాహారం ఎక్కువ తినే టాప్ 10 దేశాలను తెలియజేసింది.
కాగా, ఆ రిపోర్ట్ ప్రకారం, ప్రపంచంలో అత్యధికంగా మాంసం తినే టాప్ 10 దేశాలో ఏవో ఇప్పుడు మనం చూసేద్దాం. అందులో భారత్ ఏ ప్లేస్ అంటే?
హాంకాంగ్ మాంసం వినియోగంలో మొదటి స్థానంలో ఉన్నదంట. ఇక ఒక వ్యక్తి సంవత్సరానికి సగటు 170 కిలోలు తీసుకుంటాడు. అలాగే ఐస్లాండ్ రెండో స్థానంలో ఉంది.
ఇక్కడ గొర్రె, మాసం చేపలు ఎక్కువ తింటుంటారు, మూడో స్థానంలో మకావో ఉంది,చికెన్ వంటకాలకు ఇది ప్రసిద్ధి చెందినది, లిథువేనియా ఇక్కడ 96 శాతం మంది రోజూ మాంసం తింటారంట,
ఐదవ స్థానంలో అర్జెంటీనా, ఆరవ స్థానంలో ఆస్ట్రేలియా, ఏడవ స్థానంలో న్యూజీలాండ్, ఎనిమిదొవ స్థానంలో అమెరికా సంయుక్త రాష్ట్రాలు, తొమ్మిదొవ స్థానంలో స్పెయిన్, పదొవ స్థానంలో ఇజ్రాయెల్ ఉన్నవంట.