చిన్న వయసులోనే తెల్ల జుట్టుకు కారణాలు ఇవే!

Samatha

23 August  2025

Credit: Instagram

ఈ రోజుల్లో చాలా మంది తెల్ల జుట్టు సమస్యతో బాధ పడుతున్నారు. చిన్న వయసులోనే తెల్ల జుట్టు రావడం ఎక్కువైపోయింది.

దీంతో చాలా మంది ఏంటీ ఇంత చిన్న వయసులో జుట్టు తెల్లగా మారిపోతుందని ఇబ్బంది పడుతుంటారు. వారి కోసమే ఈ సమాచారం.

అసలు చిన్న వయసులోనే తెల్ల జుట్టు ఎందుకు వస్తుంది? దీనికి గల కారణాలు ఏవో ఇప్పుడు మనం తెలుసుకుందాం.

సరైన సమయంలో ఆహారం తీసుకోకపోవడం, శరీరానికి సరైన పోషకాలు అందకపోవడం వలన తెల్ల జుట్టు వస్తుందంట.

అలాగే ముఖ్యంగా విటమిన్ బీ12 లోపం ఎక్కువ గా ఉన్నప్పుడు ఈ సమస్య ఎదురు అవుతుందంట. అందులే విటమిన్ బీ 12 చాలా ముఖ్యమైనది.

ఇది శరీరంలో లోపించినప్పుడు  మెలనిన్ ఉత్పత్తి తగ్గిపోతుంది. దీంతో చిన్న వయసులోనే జుట్టు తెల్లగా మారడం ప్రారంభం అవుతుందంట.

అందువలన విటమిన్ బి 12 ఉన్న పాలు, గుడ్లు, మాంసం, చేపలు, పుట్టగొడుగులు, వంటి ఆహారాలను తీసుకోవడం వలన ఈ సమస్యను తగ్గిచ వచ్చునంట.

అదే విధంగా ప్రతి రోజూ సమయానికి మంచి ఆహారం, తాజాగా కూరగాయలు, ఒత్తిడి లేకుండా గడపడం వలన ఈ సమస్య తగ్గుతుందంట