చలితో జలుబు, దగ్గు సమస్యలా.. ఇదిగో ఈ సింపుల్ టిప్స్ పాటించండి!

Samatha

6 November 2025

చలికాలం వస్తే చాలు చాలా మంది దగ్గు, జలుబు సమస్యలతో సతమతం అవుతుంటారు. పదే పదే జలుబు, దగ్గు వంటి వాటి బారిన పడి ఇబ్బందులు ఎదుర్కొంటారు.

అయితే చలికాలంలో వచ్చే జలుబు, దగ్గు నుంచి ఎలా ఉపశమనం పొందాలో ఇప్పుడు మనం చూద్దాం పదండి.

ప్రతి రోజూ పసుపు పాలు తాగడం ఆరోగ్యానికి చాలా మంచిది. ఇందులో యాంటీ ఇన్‌ఫ్లమెంటరీ గుణాలు పుష్కలంగా ఉండటం వలన ఇది రోగనిరోధక శక్తిని పెంచుతుంది

ఎవరైతే చలికాలంలో జలుబు దగ్గు వంటి సమస్యలతో బాధపడుతారో, వారు తప్పకుండా ప్రతి రోజూ తులసి టీ తాగడం వలన ఇది ఆరోగ్యానికి చాలా మంచిది.

వాతావరణంలో మార్పు వలన వచ్చే జలుబు , దగ్గు, గొంతు మంట వలన అనేక ఇబ్బందులు ఎదుర్కొ్ంటారు. అయితే ఈ సమయంలో గోరు వెచ్చటి నీటిలో ఉప్పు వేసి పుక్కలించడం చాలా మంచిదంట.

ఆవిరి పట్టడం ఆరోగ్యానికి చాలా మంచిది. ముఖ్యంగా ఎవరైతే వర్షాకాలంలో చలి, దగ్గు, జలుబు, ముక్కు దిబ్బడ వంటి సమస్యలతో బాధపడతారో అలాంటి వారు ఆవిరి పట్టడం ఆరోగ్యానికి మంచిది.

అల్లం టీ ఆరోగ్యానికి చేసే మేలు గురించి ఎంత చెప్పినా తక్కువే. ఇందులో యాంటీ ఇంఫ్లమేంటరీ గుణాలు ఎక్కువా ఉంటాయి. దీనిని తాగడం వలన సీజనల్ వ్యాధుల నుంచి బయటపడవచ్చు.

అలాగే సీజన్ వ్యాధులు ధరి చేరకుండా ఉండాలి అంటే, సీజన్ మారినప్పుడు తప్పకుండా మీ ఆహారంలో ఉసిరి, నిమ్మ, అల్లం, వెల్లుల్లి, పసుపు వంటివి తీసుకోవడం చాలా మంచిది.