యోగా చేయడానికి భారతదేశంలో ఉన్న బెస్ట్ ప్లేసెస్ ఇవే!

samatha 

20 JUN  2025

Credit: Instagram

నేడు ప్రపంచ అంతర్జాతీయ యోగా దినోత్సవం. ఈ రోజు దేశంలో ప్రతి ఒక్కరూ ఘనంగా యోగా దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు.

కాగా, ప్రపంచ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా, యోగా చేయడానికి బెస్ట్ ప్లేసెస్ ఏవి?అద్భుతమైన యోగా గమ్యస్థానాలపై ఓ లుక్ వేద్దాం.

హిమాలయ పర్వత ప్రాంతాల్లో ఉన్న రిషికేశ్ అద్భుతమైన యోగా గమ్యస్థానం. నదీ తీరంలో పచ్చటి చెట్ల మధ్య యోగా చేయడం వలన మనసుకు ప్రశాంత కలుగుతుంది.

దట్టమైన పైన్ అడవులకు నిలయమైన ధర్మశాల హిమాచల్ ప్రదేశ్‌లో ఉంది. ఇక్కడ చుట్టూ కొండలు, చెట్లు, చాలా నిశ్శబ్ధ వాతావరణం ఉంటుంది.

ప్రశాంత వాతావరణంలో, యోగా చేయాలి అనుకొనే వారికి ధర్మశాల బెస్ట్ ప్లేస్. యోగా చేయడానికి కూడా ఇది అద్భుతమైన ప్రదేశం.

కర్ణాటకలోని మైసూర్‌లోనే అష్టాంగ యోగా పుట్టిందంటారు. అయితే ఇది సాంప్రదాయానికి ప్రతీక. ఇక్కడ యోగా చేస్తే చాలా ఆహ్లాదంగా ఉంటుందంట.

పార్టీలకు, ఎంజాయ్ చేయడానికే కాదు, యోగా చేయడానికి కూడా ఉన్న అద్భుతమైన ప్రదేశాల్లో గోవా బీచ్ ఒకటి. ఇక్కడి ప్రశాంతమైన వాతావరణం బాగుంటుంది.

తమిళనాడు పుదుచ్చేరి లోని ఆరోవిల్లె ఉన్న ప్రదేశం యోగాకు బెస్ట్ ప్లేస్. ప్రశాంత వాతావరణంలో యోగా చేయాలి అనుకునే వారు ఇక్కడికి వెళ్లడం ఉత్తమం.