వేసవి టూర్‌ వెళ్లాలి అనుకుంటున్నారా? దగ్గరలో ఉన్న బెస్ట్ ప్లేసెస్ ఇవే

samatha 

8 MAY 2025

Credit: Instagram

సమ్మర్ వచ్చిందంటే ఉండే ఎంజాయ్‌మెంట్ మాములుగా ఉండదు. చాలా సంతోషంగా టూర్ వెళ్తూ ఫుల్ హ్యపీగా హాలీడేస్ ఎంజాయ్ చేస్తారు.

ఇక సమ్మర్ లో చాలా ప్రదేశాలు జనసమూహంతో నిండిపోతాయి.అయితే ఎలాంటి రద్ధీ లేకుండా వేసవి ఎంజాయ్ చేయాలి అనుకుంటే తప్పకుండా ఈ ప్రదేశాలకు వెళ్లాల్సిందేనంట.

పచ్చని పొలాలు, కొండలు, జానపద సంగీతంతో నిత్యం పర్యాటకులను ఆకట్టుకునే జిరో వ్యాలీ చాలా అద్భుతమైన ప్రదేశం అంట. ఇది అరుణా చల్ ప్రదేశ్‌లో ఉంది.

భారతదేశంలోని పబ్బర్ వ్యాలీ గురించి చాలా తక్కువ మందికి తెలుసు ఇది హిమాచల్ ప్రదేశ్‌లో ఉంది. ఇక్కడి వాగులు, అందమైన ఆపిల్ తోటలు పర్యాటకులను ఎంతగానో ఆకర్షిస్తాయి. 

సమ్మర్ ఎంజాయ్‌మెంట్‌కు ఉత్తరాఖండ్‌లోని కౌసాని బెస్ట్ ప్లేస్. ఇది ప్రశాంతమైన టీ తోటలు,విహారయాత్రలకు, అందమైన కొండలు నెలవు. ఇక్కడి ప్రదేశాలు పర్యాటకులను ఎంతగానో ఆకర్షిస్తాయి.

సెరాజ్ లోయలో ఉన్న షోజా చాలా మందికి తెలియని అద్భుతమైన ప్రదేశం. ఇక్కడి పైన్ అడవులు, జలపాతాలు, అద్భుతమైన సూర్యస్తమయాలతో నిండి ఉంటుంది. అందమైన చెక్క కుటీరాలు అద్భుతంగా ఉంటాయి

మున్సియారి, ఉత్తరాఖడ్, ఈ హిమాలయ గ్రామం పంచుచులి శిఖరాల నాటకీయ దృశ్యాలన, ప్రశాంతమై గ్రామ జీవితాలను, ఉత్కంఠ భరితమైన ట్రెక్కింగ్ లను అందిస్తుంది. ఇది రద్దీ తక్కువ ఉండే ప్రశాతమైన ప్రదేశం.

పెరియార్ టైర్ రిజర్వ్ పరిధలో ఉన్న గవి ప్రశాంతమైన పర్యావరణ పర్యాటక గమ్యస్థానం. ఇక్కడ పర్యాటకుల రద్దీ తక్కువగా ఉంటుంది. ఈజీగా ట్రెక్కింగ్ చేయచ్చు.