ప్రతి రోజూ కొన్ని వేరుశెనగలు తినాలంటారు.. ఎందుకో తెలుసా?
samatha
18 march 2025
Credit: Instagram
ఆరోగ్యంగా ఉండాలంటే మంచి పోషకాహారం తీసుకోవాలి. కానీ ప్రస్తుతం చాలా మంది జంక్ ఫుడ్‌కు అలవాటు పడి అనేక అనారోగ్య సమస్యలు తెచ్చుకుంటున్నారు.
అయితే మన పెద్దవారు అప్పుడప్పుడు చెప్తుంటారు. కనీసం రోజూ గుప్పెడు వేరుశెనగలు తినండని, ఎందుకంటే ఇవి ఆరోగ్యానికి చాలా మేలుచేస్తాయంట.
కాగా, అసలు ప్రతి రోజూ కొన్ని వేరు శెనగలు ఎందుకు తినాలని చెబుతారో, దాని ప్రయోజనాలు ఏవో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
వేరుశనగల్లో పొటాషియం, కాల్షియం, భాస్వరం, విటమిన్ బి వంటివి అధికంగా ఉంటాయి. అందువలన వీటిని ప్రతి రోజూ తినడం చాలా మంచిదంట.
వేరుశనగలు కొలెస్ట్రాల్ స్థాయిలను మెరుగుపరచడం ద్వారా గుండె ఆరోగ్యాన్ని కాపాడుతాయి. గుండెకు మేలు చేస్తాయి.అందేకే వీటిని ప్రతిరోజూ తినాలంట.
వేరుశెనగల్లో ప్రోటీన్, ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. అందువలన వీటిని తినడం వలన కడుపు నిండిన అనుభూతి కలిగి, బరువు తగ్గడానికి దోహదపడుతాయి.
వేరువెనగల్లో ఉండే అధిక ఫైబర్ కంటెంట్ జీర్ణక్రియ సాఫీగా సాగడానికి మేలు చేస్తుంది.అలాగే ఇందులో ఉండే విటమిన్ ఈ మెదడు పనితీరును మెరుగుపరుస్తుంది.
వేరుశెనగలు ప్రతి రోజూ తినడం వలన ఇందులో ఉండే గ్లైసెమిక్, రక్తంలోని చక్కెర స్థాయిలను తగ్గించడానికి దోహదపడుతాయి. అందుకే మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఇది మంచి ఎంపిక.