బెల్లం తినడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఇవే!

Samatha

29 october 2025

బెల్లం ఆరోగ్యానికి చాలా మంచిది. ప్రతి రోజూ చిన్న బెల్లం ముక్క తినడం వలన అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయని చెబుతుంటారు ఆరోగ్య నిపుణులు. కాగా బెల్లం తినడం వలన కలిగే ప్రయోజనాలు ఏవో చూద్దాం.

బెల్లంలో ఐరన్, మెగ్నీషియం, పొటాషియం వంటివి చాలా ఎక్కువగా ఉంటాయి. అందువలన ప్రతి రోజూ బెల్లం తినడం వలన ఇది రక్తంలోని మలినాలను తొలిగించి, రక్తాన్ని శుభ్రం చేస్తుంది.

అలాగే ప్రతి రోజూ ఒక బెల్లం ముక్క తినడం వలన ఇందులో ఉండే ఐరన్ రక్త హీనత సమస్యను తగ్గిస్తుంది. రక్తహీనత సమస్యతో బాధ పడే వారికి ఇది ఓ వరం లాంటిదంట.

బెల్లంలో యాంటీ ఆక్సిడెంట్స్, జింక్ , సెలీనియం వంటివి ఎక్కువగా ఉంటాయి. అందువలన ఇది రోగనిరోధక శక్తిని తగ్గించి, వైరల్ ఇన్ఫెక్షన్స్ నుంచి మిమ్మల్ని కాపాడుతుంది.

భోజనం తర్వాత ప్రతి రోజూ తప్పకుండా ఒక చిన్న బెల్లం ముక్క తినడం వలన ఇది జీర్ణక్రియను సాఫీగా చేసి, పేగు ఆరోగ్యాన్ని కాపాడుతుంది. అలాగే మలబద్ధకం సమస్య నుంచి మిమ్మల్ని కాపాడుతుంది.

బెల్లం లివర్ ఆరోగ్యానికి చాలా మంచిది. ఇది కాలేయాన్ని శుభ్రపరచడంలో కీలక పాత్ర పోషిస్తుంది. ఇది శరీరంలోని విషయాన్ని బయటకు పంపి కాలేయ పనితీరును మెరుగు పరుస్తుంది.

ప్రతి రోజూ చిన్న బెల్లం ముక్క తినడం  వలన ఇది శరీరంలో ఎర్ర రక్తకణాలను మెరుగు పరిచి, ఇది శరీరానికి తక్షణ శక్తిని అందిస్తుంది. అలాగే ఆరోగ్యాన్ని కాపాడుతుంది.

బెల్లంలో ఫైబర్ ఎక్కువ మోతాదులో ఉంటుంది. అందువలన ఇది  పేగు ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. ఇది జీర్ణవ్యవస్థకు భారం కాకుండా ఆహారం నుండి పోషకాలను పూర్తిగా గ్రహించి కడుపు సమస్యలను తగ్గిస్తుంది