రోజుకు ఒక దానిమ్మ పండు తినడం వలన కలిగే ప్రయోజనాలు ఇవే!
samatha
24 JUN 2025
Credit: Instagram
దానిమ్మ పండు ఆరోగ్యానికి చాలా మంచిది. అందుకే ప్రతి ఒక్కరూ తప్పకుండా ప్రతి రోజూ ఒక దానిమ్మ పండు తినాలని చెబుతుంటారు.
దానిమ్మ పండు తినడమే కాకుండా ఈ పండు రసం తాగిన కూడా చాలా మంచిదంట. ముఖ్యంగా ఇది రక్తపోటును తగ్గించడం, ఒత్తిడిని తగ్గించడంలో దోహదపడుతుందంట.
దానిమ్మ గింజల్లో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. అందువలన ఇది గట్ బ్యాక్టీరియాను సమతుల్యం చేయడానికి, జీర్ణక్రియ సాఫీగా సాగడానికి దోహద పడుతుందంట.
అలాగే కడుపు ఉబ్బరం, అజీర్తి, గ్యాస్ ఎసిడిటి వంటి సమస్య నుంచి కూడా ఉపశమనం కలిగిస్తుందంట. అందుకే తప్పకుండా రోజుకు ఒక దానిమ్మ పండు తినాలంటారు.
అదే విధంగా దానిమ్మలోని యాంటీఆక్సిడెంట్లు ఎక్కువ మోతాదులో ఉంటాయి. అందువలన ఇవి చర్మఆరోగ్యానికి చాలా మంచివి. చర్మానికి హాని కలిగించే ఫ్రీ రాడికల్స్‌తో పోరాడతాయి.
అలాగే వృద్ధాప్య ప్రారంభ సంకేతాలను తగ్గించడంలో సహాయపడతాయి. క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల ఇది వాతావరణ మార్పుల వలన ఏర్పడే చర్మ సమస్యలను తగ్గిస్తుంది.
జలుబు లేదా దగ్గు, జ్వరంతో పోరాడి బలహీన పడి వారు త్వరగా కోలుకోవడానికి తప్పకుండా ప్రతి రోజూ ఒక దానిమ్మ పండు తినాలంటారు. ఇది ఆరోగ్యం త్వరగా కోలుకునేలా చేస్తుంది.
అలాగే గుండె ఆరోగ్యానికి కూడా దానిమ్మ చాలా మంచిది. ఇందులోని సహజ పాలీఫెనాల్స్ రక్తప్రసరణను పెంచి, గుండె పై ఒత్తిడిని తగ్గించి గుండెను ఆరోగ్యంగా ఉంచుతాయి.