టీ అంటే చాలా మందికి ఇష్టం ఉంటుంది. ఇక టీ అంటే గ్రీన్ టీ, బ్లాక్ టీ, అల్లం టీ, జామాకుల టీ, ఇలా అనేక రకాల టీలు ఉన్నాయి. వీటి గురించి అందరికీ తెలుసు.
మరీ మీకు మామిడి ఆకుల టీ గురించి తెలుసా? ఇది ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుందంట. కాగా, ఇప్పుడు మనం మామిడి ఆకుల టీ తాగడం వలన కలిగే ప్రయోజనాలు ఏవో చూద్దాం.
మామిడి ఆరోగ్యానికి చాలా మంచిది. మామిడి ఎంతో మంది ఇష్టంగా తింటారు. పచ్చి మామిడి, పండు మామిడి ఏదైనా సరే రెండూ మంచి రుచిని ఇవ్వడమే కాకుండా, ఆరోగ్యానికి మేలు చేస్తాయి.
అయితే మామిడి పండ్లు మాత్రమే కాదండోయ్, మామిడి ఆకులతో కూడా టీ చేసుకొని తాగొచ్చునంట. ఆకులను నీటిలో మరగబెట్టి, దానిని తాగాలంట. ఇది శరీరానికి మంచిది.
ప్రతి రోజూ ఎవరైతే మామిడి ఆకుల టీ తాగుతారో అందులో ఉండే ఆంథోసైనిన్లు వంటి పోషకాలు రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గిస్తాయి, అందుకే డయాబెటీస్ పేషెంట్స్‌కి ఇది వరం లాంటిది.
అలాగే, మామిడి ఆకులలో విటమిన్ సి, విటమిన్ ఎ, విటమిన్ బి, కాల్షియం, పొటాషియం, మెగ్నీషియం, ఫ్లేవనాయిడ్స్ చాలా ఉండటం వలన ఇవి శరీరానికి మేలు చేస్తాయి.
గుండె ఆరోగ్యానికి కూడా మామిడి ఆకుల టీ చాలా మంచిది. ఇది ఎవరైతే గుండె సంబంధ సమస్యలతో బాధపడుతున్నారో, వారికి మేలు చేస్తుంది, రక్తపోటు తగ్గించి, గుండెను కాపాడుతుంది.
రోజూ క్రమం తప్పకుండా మామిడి ఆకుల టీ తాగడం వలన ఇందులో ఉండే కాల్షియం, ఎముకల బలానికి ఎంతగానో ఉపయోగపడుతుంది. ఎముకల ఆరోగ్యానికి చాలా మంచిది.