వర్షాకాలంలో బ్లాక్ కాఫీ.. తాగితే ఎన్ని లాభాలో తెలుసుకోండి!
samatha
12 JUN 2025
Credit: Instagram
వర్షకాలం మొదలైంది. దీంతో చాలా మంది ఈ సమయంలో ఏ కాఫీ తాగితే మంచిదా అని ఆలోచిస్తారు. అయితే అలాంటి వారికే అద్భుతమైన సమాచారం.
వర్షాకాలంలో బ్లాక్ కాఫీ తాగడం వలన అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయంటున్నారు నిపుణులు. కాగా, అవి ఏవో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
బ్లాక్ కాఫీని వర్షాకాలంలో తాగడం వలన అది రోగనిరోధక శక్తిని పెంచుతుందంట. అలాగే ఇది మీ కేంద్ర నాడీ వ్యవస్థను ఉత్తేజ పరచడం వలన మీరు చురుకుగా ఉంటారు.
బ్లాక్ కాఫీ ప్రతి రోజూ తాగడం వలన ఈజీగా బరువు తగ్గ వచ్చు అంటున్నారు ఆరోగ్య నిపుణులు. ఇందులో కెలరీలు తక్కువగా ఉండటం వలన ఇది బరువు నియంత్రణకు తోడ్పడుతుంది.
వ్యాయామాలకు ముందు బ్లాక్ కాఫీ తాగడం వలన అడ్రినలిన్ స్థాయిలను పెంచుతుందంట. దీని వలన వ్యాయామం చేయడం వలన ఉండే అలసట దూరమవ్వడమే కాకుండా శక్తి లభిస్తుంది.
బ్లాక్ కాఫీలో క్లోరోజెనిక్ ఆమ్లం వంటి యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. అందువలన దీనిని తాగితే ఇది ఫ్రీరాడికల్స్ తో పోరాడి, మీ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.
బ్లాక్ కాఫీని క్రమం తప్పకుండా తీసుకోవడం వలన టైప్ 2 డయాబెటిస్, పార్కిన్స్ వ్యాధి ఆల్జీమర్స్ , కాలేయ వ్యాధుల వంటి వాటి నుంచి మిమ్మల్ని కాపాడుతుందంట.
బ్లాక్ కాఫీని ప్రతి రోజూ తాగడం వలన ఇది మీ కాలేయ ఆరోగ్యాన్ని మెరుగు పరుస్తుందంట. అంతే కాకుండా ఆరోగ్యకరమైన ఎంజై మ్ లను పెంచి, రోగనిరోధక శక్తిని పెంచుతుంది