ముల్తానీ మట్టీ ఫేస్‌కు కాదండోయ్.. జుట్టుకు అప్లై చేస్తే బోలెడు లాభాలు!

Samatha

2 novembar 2025

ముల్తానీ మట్టి ముఖానికి చాలా మంచిది. చాలా మంది దీనిని ఫేస్ నిగారింపు కోసం ఎక్కువగా ముఖానికి  ఉపయోగిస్తుంటారు.

అయితే ముల్తానీ మట్టి ముఖానికే కాదండోయ్, జుట్టుకు కూడా చాలా మేలు చేస్తుందని చెబుతున్నారు నిపుణులు. జుట్టు ఆరోగ్యానికి, అందానికి ఇది చాలా మంచిదంట.

ఎవరైతే ముల్తానీ మట్టిని ఉపయోగించి, హెయిర్ ప్యాక్ తయారు చేసుకొని, దానిని వారానికి రెండు సార్లు ఉపయోగిస్తారో, దాని వలన చాలా లాభాలు ఉన్నాయంట. అవి ఏవంటే?

చాలా మంది చుండ్రు సమస్యతో బాధపడుతుంటారు. అయితే అలాంటి వారు ముల్తానీ మట్టిని జుట్టుకు అప్లై చేయడం వలన ఇది చుడ్రు సమస్యను తగ్గించి, జుట్టు బ్యాక్టీరియ నశించేలా చేస్తుందంట.

అలాగే ముల్తానీ మట్టి తలలోని జిడ్డును మొత్తం తొలిగిస్తుందంట. అంతే కాకుండా, జుట్టు ఒత్తుగా, నిగారింపుగా ఉండేలా చేస్తుందంటున్నారు నిపుణులు.

ముల్తానీ మట్టిని జుట్టుకు అప్లై చేయడం వలన ఇది జుట్టుకు , మూలాల నుంచి పోషణనిచ్చి, జుట్టును దృఢంగా తయారు చేస్తుంది. అలాగే, జుట్టు రాలడాన్ని, చిట్లడాన్ని నివారిస్తుంది.

జుట్టు పెరుగుదలకు ముల్తానీ మట్టి చాలా ఉపయోగపడుతుంది. ఇది జుట్టు త్వరగా పెరిగేలా చేయడమే కాకుండా, జుట్టు చాలా ఒత్తుగా, నిగారింపుగా ఉండేలా చేస్తుందంట.

చాలా మంది జుట్టుకు ఎక్కువగా షాంపూ, కండిషనర్, హెయిర్ జెల్ వంటివి ఉపయోగిస్తారు. ఇవి తలపై పేరుకపోతాయి. అటువంటి సమయంలో ముల్తానీ మట్టి జుట్టుకు అప్లై చేయడం వలన జుట్టు నుంచి ఆ బ్యాక్టీరియాను తొలిగిస్తుంది.