మీ బాల్కనీలోకి పదే పదే పావురాలు వస్తున్నాయా.. బెస్ట్ టిప్స్ మీ కోసం!

Samatha

18 November 2025

బాల్కనీల్లోకి పావురాలు రావడం చాలా కామన్. టెర్రస్‌లపైకి బాల్కనీల్లోకి పావురాలు వచ్చి తెగ హంగామా చేస్తుంటాయి.

అయితే కొన్నిసార్లు ఈ పావురాలు మల విసర్జన చేస్తూ చాలా ఇబ్బందికర వాతావరణాన్ని సృష్టిస్తాయి. దీంతో చాలా మంది పావురాలతో ఇబ్బందులు ఎదుర్కొంటారు.

ప్రతి రోజూ బాల్కనీల్లోకి వచ్చే పావురాలతో విసిగిపోతుంటారు. అయితే అలాంటి వారి కోసమే ఈ అద్భుతమైన చిట్కాలు. అవి ఏవో చూసెయ్యండి మరి!

బాల్కనీల్లో ఉన్న ధాన్యం గిన్నెలు తీసి వెయ్యండి. అంతే కాకుండా చెత్త డబ్బాలు ఉన్నా కూడా వాటిని తీసి పక్కన పెట్టాలి. దీని వలన అవి ఆహారం కోసం బాల్కనీల్లోకి రావు.

అద్దం, సీడీ వంటి ప్రతిబింబాల వస్తువులను బాల్కనీలో తాడుకు కట్టి వేలాడదీయండి. దీని వలన పావురాలు మీ ఇంటి బాల్కనీల్లోకి రాకుండా దూరం వెళ్లిపోతాయి.

బాల్కనీలో గాలికి శబ్ధం వచ్చే చైమ్‌లను వేలాడదీయడం వలన కూడా గాలికి అవి కదిలి, శబ్ధం వచ్చినప్పుడు పావురాలు బాల్కనీలోకి రాకుండా ఉంటాయి.

పావురాలకు పాములంటే అస్సలే ఇష్ట ఉండదు. అంతే కాకుండా వాటిని చూస్తే చాలు అవి భయపడి పారిపోతాయి. అందువలన రబ్బరు పాములను బాల్కనీలో వేలాడదీయడం వలన పావురాలు దూరం పారిపోతాయంట.

బాల్కనీలో మొక్కలు లేదా కదిలే వస్తువులు, బొమ్మలు ఉంచడం వలన కూడా పావురాలు బాల్కనీల్లోకి రాకుండా దూరంగా పారిపోతాయని చెబుతున్నారు నిపుణులు.