పాలను ఇలా స్టోర్ చేస్తే.. వారమైనా ఫ్రెష్‌గా ఉండాల్సిందే!

 30 Sep 2026

Anand T

పాలు.. ఇవి మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. అయితే కొన్ని సార్లు ఫ్రిజ్‌లో పెట్టినా కూడా పాలు త్వరగా పాడైపోతాయి.

సూపర్ డ్రింక్

ముఖ్యంగా డైరీ పాలు.. ప్యాకెట్ పాలతో పోల్చుకుంటే ఇవి చాలా త్వరగా పాడైపోతుంటాయి. ఇది ప్రతి ఇంట్లో ఉండే పెద్ద సమస్య

డైరీ పాలు

అయితే ప్యాకెట్‌ పాలు ఎందుకు త్వరగా పాడైపోవంటే.. పాల ప్యాకెట్ కంపెనీలు పాలను పాడవకుండా ఉంచేందుకు కొన్ని ట్రిక్స్ ఉపయోగిస్తారు. వాటిని మనం ఇంట్లోనూ ఉపయోగించి పాలను ఎక్కవ రోజులు ఫ్రష్‌గా ఉంచుకోవచ్చు.

కంపెనీ టెక్నిక్‌

ఇందుకోసం ముందుగా పాలను తక్కువ మంటపై కాస్త వేడి చేసి.. తర్వాత ఆ పాల గిన్నెను వెంటనే ఐస్ క్యూబ్స్ ఉన్న చల్లటి నీళ్లలో ఉంచండి.

వేడి చేయడం

పాలు పూర్తిగా చల్లారిన తర్వాత, వాటిని గాలి చొరబడని గాజు లేదా స్టీల్ సీసాలో పోసి ఫ్రిజ్‌లో పెట్టండి. ఇలా చేస్తే పాలు దాదాపు 5 రోజుల వరకు పాడవకుండా ఉంటాయి.

ఐస్‌ క్యూబ్స్‌

అయితే పాలను ఎప్పుడూ ఫ్రిజ్ డోర్ దగ్గర పెట్టరాదు. ఎందుకంటే డోర్ తరచూ తెరుస్తాం కాబట్టి.. ఉష్ణోగ్రతలు మారి పాలు త్వరగా పాడవ్వొచ్చు.

డోర్‌లో పెట్టొద్దు!

చాలా మంది పాలు కాచిన వెంటనే వాటిని ప్రిజ్‌లో పెడతారు. ఇలా ఎప్పుడూ పెట్టవద్దు. దీనివల్ల ఫ్రిజ్‌లోని ఉష్ణోగ్రత మారి పాలు త్వరగా విరిగిపోతాయి.

వేడి పాలు

పాలను స్టోర్ చేయడానికి ప్లాస్టిక్ బాటిల్స్ బదులుగా మంచి క్వాలిటీ ఉన్న స్టీల్ లేదా గాజు పాత్రలను వాడితే అవి ఎక్కవ రోజులు తాజాగా ఉంటాయి.

సురక్షితమైన పాత్రలు