ఈ మధ్య సోషల్ మీడియాలో మగ క్యాప్సికం, ఆడ క్యాప్సికం అంటూ అనేక వార్తలు హల్ చల్ అవుతున్నాయి.
సోషల్ మీడియా
మరి నిజంగానే మగ క్యాప్సికం, ఆడ క్యాప్సికం ఉంటుందా. దీని గురించి నిపుణులు ఏమంటున్నారో ఇప్పుడు విరవరంగా తెలుసుకుందాం.
లింగం తేడా
రోజు వారి వంటల్లో ఉపయోగించుకునే క్యాప్సికం మూడు రంగుల్లో లభిస్తుంది. ఎరుపు,పసుపు, ఆకుపచ్చరంగుల్లో ఉంటుంది. ఇక చాలా మంది వీటి కింద ఉండే గుబుల సంఖ్యను బట్టి, మేల్, ఫీమేల్ అంటుంటారు.
మూడు రంగులు
అయితే వీటిలో లింగం పరంగా తేడా ఉంటుందా అంటే? క్యాప్సికం అనేది ఒక కూరగాయ. కొందరు దీనిని ఒక పండు అని కూడా అంటారు.
కూరగాయ
ఇవి క్యాప్సికం మొక్క మీద పూసే పువ్వు పరాగసంపర్కం జరిగి, కాయగా ఏర్పడుతాయి. అయితే పువ్వులలో ఆడ పువ్వులు, మగ పువ్వులు ఉండొచ్చు.
పువ్వుల్లో తేడా
కానీ క్యాప్సికంలో మాత్రం ఆడ క్యాప్సికం, మగ క్యాప్సికం అనే తేడా ఉండదు. ప్రతి క్యాప్సికం బయాలజికల్ ప్రాసెస్‌లో తారు అవుతుంది కాబట్టి, అన్నీ ఒకే రకమైనవంట.
అన్నీ ఒకేరకమైనవి
అయితే చాలా మంది క్యాప్సికం కింద కనిపించే గుబ్బలు ఆధారంగా మగ, ఆడ అనే బేధం నిర్ణయిస్తారు. కానీ ఇది పెరిగే వాతావరణం బట్టి ఉంటుందంట.
గుబ్బలు
కొన్ని సార్లు మంచి సూర్య రశ్మి , నీరు, అందితే ఆ కాయ గుబులు ఎక్కువగా ఉంటాయి. లేకపోతే తక్కువగా ఉంటాయంట.