స్మైల్ బాబు స్మైల్.. నవ్వుతో ఎన్ని లాభాలో తెలుసా?

Samatha

2 July 2026

చిన్న స్మైల్ చాలు మనసుకు ఎంతో హాయిని ఆనందాన్ని ఇస్తుంది. ఇది స్మైల్ ఇచ్చిన వారిలోనే కాకుండా, ఎదుట వచ్చే వారిలో కూడా పాజిటివ్‌ను నింపుతుంది.

స్మైల్

అయితే కొంత మంది నవ్వడమే కష్టంగా భావిస్తుంటారు. కానీ చిన్న నవ్వు వలన పుట్టెడు లాభాలు ఉన్నాయని చెబుతున్నారు నిపుణులు. దాని గురించి తెలుసుకుందాం.

నవ్వడం

నవ్వడం వలన ఆరోగ్యానికి అనేక ప్రయోజనాలు ఉన్నాయంట. ముఖ్యంగా నవ్వడం వలన ఎండార్ఫిన్ అనే హార్మోన్ రిలీజ్ అవుతుంది. ఇది మానసిక ఒత్తిడి నుంచి తగ్గిస్తుంది.

ప్రయోజనాలు

మానసిక ఒత్తిడి తగ్గుతుంది. అంతే కాకుండా ఇది ఆందోళనను తగ్గించి, మానసిక స్థితిని మెరుగు పరుస్తుంది. ప్రశాంతతను అందిస్తుంది.

మానసిక ఒత్తిడి

 అంతే కాకుండా, నవ్వు గుండెకు కూడా అనేక విధాలుగా మేలు చేస్తుందంట. ఇది రక్త ప్రసరణను మెరుగు పరిచి, బీపీ కంట్రోల్‌లో ఉండేలా చేస్తుంది అలాగే గుండె పోటు రిస్క్‌కు కూడా తగ్గిస్తుంది.

గుండె ఆరోగ్యం

చర్మ ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. ప్రతి రోజూ నవ్వడం వలన చర్మం గ్లోగా కనిపిస్తుంది. అంతే కాకుండా అందంగా కనిపిస్తారు. అందుకే నవ్వడం ముఖ్యం.

చర్మ ఆరోగ్యం

బాగా నవ్వడం వలన తల నొప్పి, వంటి సమస్యలు ఉండవు, అంతే కాకుండా వీరికి ఒత్తిడి తగ్గుతుంది. మెమోరీ పవర్ అనేది పెరుగుతుందంట.

మెమోరీ పవర్

నవ్వు ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. ముఖ్యంగా ఇది రోగనిరోధక శక్తిని పెంచుతుంది. హార్మోన్ల పనితీరును మెరుగు పరుస్తుంది. మీలో కాన్ఫిడెన్స్ పెంచుతుంది.

హర్మోన్స్ పనితీరు