జూలై నెల వచ్చిందంటే చాలు కొన్ని రకాల పువ్వులు వికసించి, అందరినీ ఆకట్టుకుంటాయి. కాగా ఇప్పుడు మనం జూలై నెలలో పూసే పువ్వులు ఏవో చూసేద్దాం.
జూలై
లెమన్ క్వీన్ పొద్దుతిరుగుడు పువ్వులు, ఇవి ఎనిమిది అడుగుల ఎత్తు వరకు పెరుగుతాయి. జూలై నెలలో వికసించే పువ్వులలో ఇవి ముందుంటాయి.
లెమన్ క్వీన్
బటర్ ఫ్లై మిల్క్ వీడ్, జూలై నెలలో పూసే ప్రకాశవంతమైన పూలలో ఇవి కూడా ఒకటి. ఇవి ఈ నెల పొడుగునా పూస్తాయి. ప్రతి ఒక్కరినీ కనువిందు చేస్తాయి. గుంపులుగా నారిజం , ఎరుపు రంగులలో ఇవి వికసిస్తాయి.
బటర్ ఫ్లై మిల్క్ వీడ్
డేలిలీ, మోనార్క్, క్వీన్ సీతాకోక చిలుకలకు అతిథ్యమిచ్చే, ఈ మొక్క జూలై మాసంలో వికసిస్తుంది. ఇవి పచ్చిక బయళ్లలో ఎక్కువగా కనిపిస్తాయి. చాలా ప్రకాశవంతంగా ఉంటాయి.
డేలిలీ
ట్రూ లిల్లీలు, ఇవి డేలిల్లీల వలే కాకుండా అత్యధిక సువాసనను వెదజల్లుతాయి. అంతే కాకుండా కాండం చుట్టూ ఉంటూ, చాలా అందంగా ఉంటాయి ఈ పూలు. జూలైలో వికసిస్తాయి.
ట్రూ లిల్లీలు
కార్డినల్ పువ్వులు, ఎరుపు రంగులో చాలా అద్భుతంగా కనిపించే పువ్వులలో ఇవి ముందుంటాయి. చెరువులు, తేమతో కూడిన వాతావరణంలో ఎక్కువగా కనిపిస్తాయి. జూలైలో వికసించే పూలలో ఇవి కూడా ఒకటి.
కార్డినల్ పువ్వులు
తేనెటీగలు, సీతాకోక చిలుకలను ఆకర్షించే పూలలో కోన్ల్ ప్లవర్లు ముందు ఉంటాయి. జూలై నెలలో ఈ పూలు గుత్తులు గుత్తులుగా విరగబూస్తాయి.
కోన్ల్ ప్లర్స్
జెయింట్ హిస్సోప్, పొడవైన గుత్తులుగా చిన్న చిన్నగా పూసే ఈ పూలు చాలా ఆకర్షణీయంగా, సువాసనను వెదజల్లుతూ ఉంటాయి. జూలై నెలలో పూసే అందమైన పూలలో ఇవి కూడా ఒకటి.