చలికాలం వస్తే చాలు చాలా మందిలో ఉండే అతి పెద్ద డౌట్, చలి కాలంలో చన్నీటితో స్నానం చేయవచ్చునా? లేదా?
కొందరేమో తప్పకుండా చలికాలంలో చన్నీటితో స్నానం చేస్తారు, మరికొంత మంది చలికాలంలో చన్నీటితో స్నానం చేయడం వలన అనారోగ్య సమస్యలు వస్తాయని వేడి నీటితో స్నానం చేస్తుంటారు.
మరి అసలు చలికాలంలో వేడి నీరు, చల్లటి నీరు దేనితో స్నానం చేయాలి? దీని గురించి పండితులు ఏం చెబుతున్నారో ఇప్పుడు మనం చూద్దాం పదండి
చన్నీటితో స్నానం ఆరోగ్యానికి చాలా మంచిదంట. ముఖ్యంగా ఆరోగ్యవంతులైన యువతీ, యువకులు చన్నీటి స్నానం చేయడం వలన రక్త ప్రసరణ మెరుగు పడుతుంది.
అలాగే చన్నీటితో సాన్నం చేయడం వలన ధమనులు బలంగా తయారయ్యి, రక్తపోటు తగ్గడమే కాకుండా, డిప్రెషన్ కూడా తగ్గుతుందంట.
అంతే కాకుండా చాలా మంది చన్నీటితో స్నానం చేయడానికి భయపడి పోతుంటారు. అయితే చల్లటి నీళ్లతో స్నానం చేయడం వలన జుట్టు దృఢంగా తయారవుతుందంట.
ప్రతి రోజూ చలంలటి నీటితో స్నానం చేయడం వలన జీవక్రియ రేటు పెరగి, ఇది బరువు తగ్గేందుకు సహాయపడుతుందని చెబుతున్నారు నిపుణులు.
అయితే ఆస్తమా పేషెంట్స్,గుండె పోటు, మధుమేహం , ఫిట్స్ వంటి సమస్యలు ఉన్నవారు, చలికాలంలో చన్నీటికి ఎంత దూరం ఉంటే అంత మంచిది.