వర్షాకాలంలో పెరుగు తినడం మంచిదేనా? డాక్టర్‌లు చెప్పేదేంటి?

09 July 2026

Anand T

పెరుగు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఇందులో ఉండే ప్రోటీన్లను మన శరీరం త్వరగా జీర్ణం చేసుకుంటుంది. తద్వారా జీర్ణవ్యవస్థ మెరుగుపడుతుంది.

పెరుగు

పెరుగులో గుడ్ బ్యాక్టీరియా ఉంటుంది. కాబట్టి జీర్ణక్రియ బలహీనంగా ఉన్నవారికి, పిల్లలకు, వృద్ధులకు పెరుగు చాలా మంచిది.

జీర్ణవ్యవస్థ

పెరుగులో క్యాల్షియం, ప్రోటీన్, విటమిన్ డి వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి ఎముకలను, కండరాలను బలంగా ఉంచి రోగనిరోధక శక్తిని పెంచుతాయి.

ఎముకల బలం

శీతాకాలం, వర్షాకాలంలో పెరుగు తింటే జలుబు చేస్తుందని కొందరు భావిస్తారు. కానీ నిపుణుల ప్రకారం, వర్షాకాలంలోనూ పెరుగును సురక్షితంగా తినవచ్చు.

వర్షాకాలంలోనూ సురక్షితం

వర్షాకాలంలో రోజుకు రెండుసార్లు పెరుగు తీసుకోవడం వల్ల మలబద్ధకం, విరేచనాల సమస్యలు తగ్గడంతో పాటు బరువు కూడా తగ్గొచ్చు.

బరువు తగ్గడం

పెరుగు గుండెను ఆరోగ్యంగా ఉంచి, దాని పనితీరును మెరుగుపరుస్తుంది. అంతేకాకుండా చర్మం పొడిబారకుండా కాంతివంతంగా మెరిసేలా చేస్తుంది.

గుండే ఆరోగ్యం

పెరుగును ఉదయం లేదా మధ్యాహ్నం పూట మాత్రమే తినాలని వైద్యులు సూచిస్తున్నారు. రాత్రి వేళల్లో పెరుగు తినడం ఆరోగ్యానికి మంచిది కాదు.

రాత్రి తినొద్దు

వర్షాకాలంలో జలుబు, అజీర్ణం కాకుండా ఉండాలంటే పెరుగులో కొద్దిగా మిరియాల పొడి, వేయించిన జీలకర్ర పొడి లేదా తేనె కలుపుకుని తింటే జీర్ణక్రియ బాగుంటుంది.

జాగ్రత్తలు