ప్రతీదీ వాట్సాప్ స్టేటస్‌లో పెడుతున్నారా? అయితే ఇది పెద్ద సమస్యే!
Samatha
6 January 2026
కొంత మంది ప్రతి విషయాన్ని వాట్సాప్ స్టేటస్ ద్వారా తన స్నేహితులు, బంధుమిత్రులకు తెలియజేస్తుంటారు. ఏ చిన్న విషయం అయినా సరే స్టేటస్ పెట్టేస్తుంటారు.
వాట్సాప్ స్టేటస్
అయితే ఇలా వాట్సాప్ స్టేటస్ పెట్టడం వెనుక కూడా అనేక కారణాలు ఉన్నాయని చెబుతున్నారు నిపుణులు. కాగా దీని గురించి నిపుణులు ఏమంటున్నారో చూద్దాం.
నిపుణుల అభిప్రాయం
ఇలా ప్రతి విషయాన్ని వాట్సాప్ స్టేటస్‌లో పెట్టడం కూడా ఒక రకమైన మానసిక వ్యాధి అంటున్నారు సైకాలజిస్టులు. ఇది అనేక రకాల కారణాల వలన కలగుతుందంట.
కారణాలు ఇవే
కొందరు వాట్సాప్ స్టేటస్, తమకు ముఖ్యమైన వారికి తన భావాన్ని వ్యక్తపరచడం ఇష్టం లేక, స్టేటస్ ద్వారా వెళ్లడిస్తారు.
భావాన్ని వ్యక్తపరచడం
ఇంకొంత మంది మాత్రం వాట్సాప్ స్టేటస్ లైక్స్, కామెంట్స్, రిప్లేస్ చూడాలి, అన్న విధానంలో పెడుతుంటారు. ఇంకొంత మంది స్టేటస్ పెట్టడం వలన తనను తాను చూపెట్టుకోవాలి అనుకుంటారు.
లైక్స్ ,కామెంట్స్, రిప్లేస్
అయితే సైకాలజీ ప్రకారం, దీనిని ఎమోషనల్ డిపెండెన్సీ ఆన్ సోషల్ మీడియా అటెన్షన్ సీకింగ్ ప్యాటర్న్ ఆఫ్ బీయింగ్ ఇగ్నోర్డ్ అని పిలుస్తారంట.
సైకాలజీ ప్రకారం
ప్రతి చిన్న విషయాన్ని స్టేటస్‌లో పెట్టాలి అనుకునేవారు, ఒంటరితనం, అసంతృప్తి, తన భావాలను పంచుకునే వ్యక్తి లేకపోవం వలన స్టేటస్ ద్వారా తాక్కాలిక ఆనందం పొందుతారు
ఒంటరితనం
అయితే నిపుణులు మాట్లాడుతూ, స్టేటస్ పెట్టడం సమస్య కాదు, కానీ ప్రతి విషయాన్ని స్టేటస్ ద్వారా చెప్పాలి అనిపిస్తే మాత్రం కొంత జాగ్రత్త అవసరం అంటున్నారు