ఏ పని చేసినా అలసి పోతున్నారా? అలసట ఎక్కువ అవుతుందా?
Samatha
12 November 2025
ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు పెద్ద వారు. కానీ తీసుకుంటున్న ఆహారం, జీవన శైలి కారణంగా చాలా మంది అనేక అనారోగ్య సమస్యల బారిన పడుతున్నారు.
వర్క్ బిజీలో పడి సరైన సమయానికి సరైన ఆహారం తీసుకోలేక ఎన్నో సమస్యలు ఎదుర్కుంటుంటారు. అయితే అలాంటి వారి కోసమే ఈ అద్భుత సమాచారం
చాలా మంది చిన్న పనికే ఎక్కువ అలసి పోవడం వంటి సమస్యలు ఎక్కువగా ఎదుర్కుంటారు. అయితే అలాంటి వారు తప్పకుండా ఈ ఆహారాలు తమ డైట్‌లో చేర్చుకోవాలంట.
యాపిల్ ఆరోగ్యానికి చాలా మంచిది. అందుకే తప్పకుండా ప్రతి రోజూ ఉదయం ఒక యాపిల్ పండు తినడం వలన ఎలాంటి అనారోగ్య సమస్యలు దరిచేరవు.
పని చేస్తూ ఎక్కువగా అలిసి పోయేవారు తమ ఆహారంలో డ్రై ఫ్రూట్స్, సీడ్స్, నట్స్, మఖానా వంటి వాటిని చేర్చుకోవడం వలన అందులోని ఫ్యాటీ యాసిడ్స్, విటమిన్స్ శరీరానికి శక్తిని అందజేస్తాయి.
అదే విధంగా, మొక్కజొన్న కూడా ఆరోగ్యానికి చాలా మంచిది. ఇందులో యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉంటాయి. ఇది తినడం వలన ఎనర్జీ లెవల్స్ పెరుగుతాయంట.
అరటి పండులో పొటాషియం ఎక్కువ మోతాదులో ఉండటం వలన అరటి పండు తినడం వలన శరీరానికి తక్షణ శక్తి అందుతుంది. నీరసం వంటి సమస్య తగ్గుతుంది.
ప్రతి రోజూ ఒక కోడి గుడ్డు తినడం వలన కూడా శరీరానికి శక్తి అందుతుంది. ఇది నీరసం , అలసట నుంచి ఉపశమనం కలిగేలా చేస్తుందంట.