హెయిర్‌ఫాల్‌కు చెక్ పెట్టే సూపర్ ఫుడ్స్.. డైలీ తింటే మళ్లీ పెరగడం ఖాయం!
17 Jun 2026
Anand T
మారుతున్న లైఫ్‌స్టైల్, ఆహారపు అలవాట్ల కారణంగా చాలా మంది జుట్టు రాలడం, తెల్లబడడం సమస్యలను ఎదుర్కొంటున్నారు. కాబట్టి ఈ సమ్యకు చెక్ పెట్టేందుకు మీరు మీ రోజువారి జీవనశైలిలో కొన్ని ఆహారాలు చేర్చుకుంటే సరిపోతుంది. అవేంటో చూద్దాం.
హెయిర్ ఫాల్
జుట్టు ఎదుగుదలకు కావలసిన ప్రోటీన్, బయోటిన్ గుడ్లలో పుష్కలంగా ఉంటాయి. ఇవి జుట్టును కుదుళ్ల నుండి బలంగా మారుస్తాయి.
కోడిగుడ్లు
బాదంలో ఉండే విటమిన్-ఇ, యాంటీఆక్సిడెంట్లు జుట్టుకు మంచి పోషణను అందించి, బ్రేకేజ్‌ను తగ్గిస్తాయి.
బాదం పప్పులు
వాల్‌నట్స్‌లో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ సమృద్ధిగా ఉంటాయి. ఇవి స్కాల్ప్ ను తేమగా ఉంచి, జుట్టు రాలడాన్ని అరికడతాయి.
వాల్‌నట్స్
ఈ గింజలలో ఉండే ఒమేగా-3, ప్రోటీన్ జుట్టుకు పవర్‌హౌస్‌లా పనిచేస్తాయి. ఇవి జుట్టుకు సహజమైన మెరుపును ఇస్తాయి.
చియా సీడ్స్
గుమ్మడి గింజల్లో జింక్ ఎక్కువగా ఉంటుంది. ఇది కొత్త జుట్టు మొలవడానికి, స్కాల్ప్ ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి సహాయపడుతుంది.
గుమ్మడి గింజలు
పాలకూర వంటి ఆకుకూరల్లో ఐరన్, విటమిన్-ఎ, సి ఉంటాయి. ఇవి జుట్టు వేగంగా పెరగడానికి దోహదం చేస్తాయి.
పాలకూర
విటమిన్-సి, కొల్లాజెన్‌ను పెంచే గుణాలు ఉసిరిలో ఉన్నాయి. ఇది జుట్టును నల్లగా, పొడవుగా మార్చడంలో అద్భుతంగా పనిచేస్తుంది.
ఉసిరికాయ
నారింజ, నిమ్మ వంటి సిట్రస్ పండ్లు శరీరంలో ఐరన్ గ్రహింపును పెంచుతాయి, దీనివల్ల జుట్టు కుదుళ్లకు రక్తప్రసరణ బాగా జరిగి జుట్టు రాలడం తగ్గుతుంది.