పైసా ఖర్చులేకుండా.. వర్షాకాలంలో దోమలను తరిమికొట్టే సూపర్ ట్రిక్స్
Anand T
13 June 2026
వర్షాకాంలో దొమల బెడద ఎక్కవగా ఉంటుంది. కాబట్టి వర్షాకాలంలో మనం దోమల భారీన పడకుండా ఉండాలంటే కొన్ని చిట్కాలను పాటించాల్సి ఉంటుంది. అందులో మొదటిది మన ఇంటితో పాటు ఇంటి పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవడం.
దోమల బెడద
ఇంటి చుట్టుపక్కల ఉండే మురుగు కాలువల్లో నీరు నిల్వ ఉండకుండా చూసుకోండి. నీరు సాఫీగా సాగిపోయేలా క్రమం తప్పకుండా డ్రైనేజీలను క్లిన్ చేసుకోండి.
డ్రైనేజీ క్లీనింగ్
వారానికి ఒకసారి తప్పనిసరిగా మీ ఇల్లు, పరిసరాల్లో ఎక్కడైనా దోమలు ఉన్నాయా? అవి వచ్చేందుకు అనుకూలమైన వాతావరణం ఏమైనా ఉందా అని తనిఖీ చేసి, దోమలు పెరిగే వనరులను నాశనం చేయండి.
డ్రై డే క్లినింగ్
చాలామంది గమనించని విషయం ఏమిటంటే, ఫ్రిజ్ వెనుక భాగంలో ఉండే వేస్ట్ వాటర్ ట్రేలో దోమలు ఎక్కువగా గుడ్లు పెడతాయి. కాబట్టి కచ్చితంగా దానిని క్రమం తప్పకుండా క్లీన్ చేయండి.
ఫ్రిజ్ ట్రేని క్లనింగ్
శరీరాన్ని పూర్తిగా కప్పేసేలా ఉండే బట్టలను ధరించండి. ముఖ్యంగా దోమలను ఆకర్షించని లేత రంగు దుస్తులను వేసుకోవడానికి ట్రై చేయండి.
ఫుల్ డ్రెసెస్
ఇంట్లో పెంచే మొక్కల కుండీల కింద ఉండే ప్లేట్లలో నీరు ఎక్కువ రోజులు నిల్వ ఉండకుండా చూసుకోండి. మనీ ప్లాంట్ వంటి నీటి మొక్కల నీటిని తరచూ మారుస్తూ ఉండాలి. వాటిని ఎప్పటికప్పుడూ క్లీన్ చేయండి.
కుండీల క్లీనింగ్
రాత్రి వేళల్లో పడుకునేటప్పుడు తప్పనిసరిగా దోమతెరలను కప్పుకొని పడునేందుకు ట్రై చేయండి. ముఖ్యంగా చిన్న పిల్లల విషయంలో ఈ జాగ్రత్త చాలా అవసరం.
దోమతెరలు
సాయంత్రం అవ్వగానే ఇంటి కిటికీలు మూసివేయండి లేదా వాటికి నెట్స్ వంటికి ఏర్పాటు చేయండి.. ఎందుకంటే ఇవి దోమలను ఇంట్లోకి రాకుండా చేస్తాయి.
కిటికీలకు నెట్స్
అలాగే ఇంటి పరిసరాల్లో, వేప లేదా తులసి వంటి మొక్కలను పెంచుకోండి. ఇవి దోమను ఇంట్లోకి రాకుండా చేస్తాయి. ఇలాంటి కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా వర్షాకాలంలో దోమల భారీన పడుకుండా ఆరోగ్యంగా ఉండచ్చు.