ఇన్నాళ్లు తప్పు చేశామా? రోజుకు ఎన్ని గుడ్లు తినాలో తెలుసా?
10 Oct 2026
Anand T
గుడ్డు.. ఇది మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని మన అందిరికీ తెలుసు.. అంతేకాదు తక్కువ ఖర్చుతో ఎక్కవ పోషకాలు అందించే ఆహారం కూడా ఇదే.
అయితే ప్రయోజనాలు ఉన్నాయని కొందరు ఎక్కువ గుడ్లు తింటే.. మరి కొందరు అస్సలే తినరు!
మరీ రోజుకు ఎన్ని గుడ్లు తినవచ్చు? ఒకవేళ ఎక్కువగా తింటే మన శరీరంలో జరిగే మార్పులేంటో ఇక్కడ వివరంగా తెలుసుకుందాం.
గుడ్లు మన ఆరోగ్యానికి ప్రయోజనకరమైనవే అయినప్పటికీ.. శరీర పరిస్థితిని బట్టి వాటిని లిమిట్‌లో తినాల్సి ఉంటుంది.
ప్రోటీన్ కోసం మాత్రమే మీరు ఎక్కువ గుడ్లను తింటే.. మీరు ఇతర విటమిన్‌ల లోపాన్ని ఎదుర్కోవలసి ఉంటుంది.
ఒక ఆరోగ్యంగా ఉన్న వ్యక్తి.. రోజుకు 1 నుండి 2 గుడ్లు తినడం ఉత్తమమైనది ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
అంతేకాదు సున్నితమైన జీర్ణవ్యవస్థ ఉన్న వ్యక్తులు.. రోజులో ఎక్కువగా గుడ్లు తింటే కడుపు ఉబ్బరం వంటి సమస్యలు రావచ్చు.
అలాగే బరువు తగ్గాలనుకునేవారు బ్రేక్‌ఫాస్ట్‌లోకి 2-3 ఉడికించిన గుడ్లు తినొచ్చు. కాబట్టి మీ అవసరాన్ని బట్టి మాత్రమే మీరు గుడ్లను తినండి.
మరిన్ని వెబ్ స్టోరీస్
తొలకరి వానలు మొదలయ్యాయి.. ఈ సమయంలో ఆకు కూరలు తినొచ్చా?
రెగ్యులర్ కాఫీ బోర్ కొట్టిందా.. కొత్తగా సరికొత్తగా ఈ బనానా కాఫీ ట్రై చేయండి
చీరలో అందంగా. మెగా డాటర్ బ్యూటిపుల్ ఫొటోస్