ఇంట్లో పుదీనా మొక్క పెంచుకోవాలా?.. సింపుల్ టిప్స్ మీ కోసం!
Samatha
12 November 2025
పుదీనా మొక్క ఆరోగ్యానికి చాలా మంచిది. దీనిని చాలా మంది వంటకాల్లో ఎక్కువగా ఉపయోగిస్తుంటారు. అందుకే ప్రతి ఒక్కరూ మార్కెట్‌కు వెళ్లి నప్పుడు దీనిని కొనుగోలు చేస్తారు.
అయితే ఎప్పుడూ మార్కెట్‌లో దీనిని కొనుగోలు చేయడం ఎందుకు? ఇంటిలోనే దీనిని సులభంగా పెంచుకోవచ్చునంట. మరి దాని గురించే తెలుసుకుందాం.
అసలు పుదీనా మొక్కను ఇంటిలోపల ఎలా పెంచాలి. దీనిని పెంచే క్రమంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏవి అనేది ఇప్పుడు మనం చూద్దాం.
పుదీనా మొక్కను పెంచడానికి ఎప్పుడూ కూడా లోతుగా , వెడల్పుగా ఉన్న కుండీని తీసుకోవాలంట. అప్పుడే మొక్క మంచిగా పెరుగుతుంది.
ఇక పుదీనా మొక్కకు మంచి నల్లమట్టి లేదా ఎర్రటి మట్టి చాలా అవసరం. ఇందులో మొక్క చాలా త్వరగా పెరుగుతుంది.
దీని కోసం మీరు మంచి మట్టి తీసుకొని, దానిని కుండిలో వేసి నిండుగా నింపాలి. తర్వాత వేర్లు ఉన్న పుదీనా మొక్కను అందులో పెట్టాలి. వీలైతే రెండు మూడు వేర్లు ఉన్న కొమ్మను నాటడం మంచిది.
ఇక మీరు పెట్టే ఈ పుదీనా మొక్కను సూర్యర్శి ఎక్కువగా ఉండాల్సిన అవసరం లేదు. ఇది ఏ ప్రదేశంలో ఉన్నా సరే చాలా సులభంగా పెరుగుతుందంట.
కానీ ఈ మొక్కకు నీరు చాలా అవసరం. అందువలన ఎప్పుడూ ఈ మొక్క వద్ద తేమగా ఉండేలా చూసుకోవాలి. రోజూ క్రమం తప్పకుండా నీరు పోయాలి.