ఇంట్లో ఎలుకల గోల ఎక్కువైందా.. ఈ టిప్స్‌తో తరిమి కొట్టండి!
Samatha
7 november 2025
చాలా మంది ఇంటిలో ఉండే అతి పెద్ద సమస్య ఎలుకల బెడద. ఇవి చూడటానికి చిన్నగా ఉన్నా, వీటితో ఉండే సమస్యలు మాత్రం చాలా ఎక్కువగా ఉంటాయి.
ఇవి ఇంటిలోని ఖరీదైన వస్తువులను పాడు చేయడమే కాకుండా, ఇంటిలో ఉన్న ఆహారపదార్థాలను తింటూ చాలా గందరగోళం సృష్టిస్తాయి.
అంతే కాకుండా ఎలక్ట్రానిక్ వస్తువులు టీవీ, రిఫ్రిజిరేటర్ల వైర్లు కొరికి వేయడం, కొత్త బట్టలను కొరికి పాడు చేయడం లాంటివి చేస్తూ ఆ ఇంటి వారిని విసిగిస్తుంటాయి.
దీంతో చాలా మంది వీటిని ఇంటి నుంచి తరిమి కొట్టడానికి నానా ప్రయత్నాలు చేస్తుంటారు. కొందరు వీటిని బోనులో బంధిస్తూ , వాటిని తరిమి కొట్టాలని చూస్తారు.
మరికొంత మంది మాత్రం ఇవి చనిపోవడానికి మార్కెట్‌లో మందులుతీసుకొచ్చి పెడుతుంటారు. కానీ ఇవన్నీ లేకుండా సింపుల్‌గా వీటిని ఇంటి నుంచి తరిమి కొట్ట వచ్చునంట. ఎలా అంటే?
నారింజ తొక్కలు ఎలుకలను తరిమి కొట్టడంలో కీలక పాత్ర పోషిస్తాయంట. వీటి వాసన వాటికి నచ్చదంట. అందువలన అవి అక్కడ నుంచి పారిపోతాయి
ఎందుకంటే? ఎలుకలకు నారింజ పండు ఘాటైన వాసన నచ్చదంట. అందువలన ఎలుకలు ఉన్న ప్రదేశంలో నారింజ తొక్కలను పెట్టడం వలన అవి పారిపోయే ఛాన్స్ ఉన్నదంట.
అయితే నారింజ తొక్కలే కాకుండా, వీటిని ఎండ బెట్టి పొడి చేసి, నీటిలో కలిపి స్ఫ్రే చేయవచ్చునంట, లేదా ఆ పొడిని గుడ్డలో కట్టి, ఎలుకలు ఉన్న ప్రదేశంలో పెట్టడం వలన అవి పారిపోతాయంట.