మీ మెదడును రహస్యంగా దెబ్బతీసే ఐదు చెడు అలవాట్లు ఇవే!
samatha
17 JUN 2025
Credit: Instagram
మెదడు పనితీరు బాగుండాలి అంటే కొన్నింటికి దూరంగా ఉండాలని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు మనకు తెలియకుండానే కొన్ని అలవాట్లు మెదడు పనితీరును దెబ్బతీస్తాయంట.
కొంత మంది నిరతరం ఫోన్ చూస్తూ ఉంటారు. అయితే ఎక్కువ సేపు స్క్రీన్ చూడటం వలన మెదడు పనితీరు అనేది మెల్లిగా దెబ్బతింటుందంట.
ఎక్కువగా డిజిటల్ మీడియాకే అడక్ట్ అయిపోవడం వలన మనం మన సొంతంగా రాయడం, లేదా నేర్చుకోవడం మర్చిపోవడమే కాకుండా జ్ఞాపకశక్తి తగ్గుతుందంట.
ఈ రోజుల్లో వర్క్ ఫ్రమ్ హోమ్స్ ఎక్కువ అయ్యాయి. అయితే నిరతరం ఎలాంటి కదలిక లేకుండా పని చేయడం వలన మెదడుకు రక్తప్రసరణ తగ్గి మెదడు పనితీరు మందగిస్తుందంట.
ప్రాసెస్ చేసిన ఫుడ్, అధిక చక్కెర గల ఆహారపదార్థాలు తీసుకోవడం వలన ఇది మెదడు పనితీరును దెబ్బతీసే అవకాశం మెండుగా ఉంది అంటున్నారు ఆరోగ్య నిపుణులు.
క్రమం తప్పకుండా ఆరు నుంచి ఏడు గంటలు నిద్రపోవాలంట. మంచి నిద్ర వలన మెదడు చురుకుగా పని చేస్తుంది. దీంతో జ్ఞాపక శక్తి అనేది పెరుగుతుంది.
కానీ ఈ రోజుల్లో చాలా మంది సరిగ్గా నిద్రపోవడం లేదు.దీని వలన ఆందోళన, నిరాశ, వంటి సమస్యలు ఎదురయ్యి జ్ఞాపకశక్తి తగ్గడమే కాకుండా ఆలోచన శక్తి కూడా తగ్గిపోతుందంట.
మొబైల్‌కి అంకితం అవ్వడం సామాజికంగా అందరికీ దూరంగా ఉండటం వలన ఇది మైండ్ సెట్‌ను తీవ్రంగా ప్రభావితం చేస్తుందంట. దీని వలన మెదడు పనితీరు మందగిస్తుందంట.