చింత చిగురుతో ఆరోగ్యం భద్రం.. తింటే ఎన్ని లాభాలో..
samatha
23 MAY 2025
Credit: Instagram
చింత పండుతో మనం అనేక రకాల వంటలు చేసుకుంటాం. అంతే కాకుండా చింత పండుతో చేసిన రసం, పులిహోర మంచి రుచిని ఇస్తాయి.
అంతే కాకుండా చింత పండు కూడా ఆరోగ్యానికి చాలా మంచిది. అయితే చింత పండు మాత్రమే కాదండోయ్ చింత చిగురుతో కూడా అనేక లాభాలు ఉన్నాయంట.
చింత చిగురుతో మనం వంటలు చేసుకోవడం వలన అవి మంచి రుచిని ఇవ్వడమే కాకుండా ఆరోగ్యానికి కూడా అనేక విధాలుగా మేలు చేస్తుందంట.
పల్లెటూర్లలో చింత చిగురు అనేది చాలా సులభంగా దొరకుతుంది. దీనిని ఏకంగా ఫ్రెష్‌గా చెట్టు మీద నుంచి కోసుకొని వంటలు చేసుకోవచ్చు.
చింత చిగురుతో పప్పు, చింత చిగురు పచ్చడి, మరీ ముఖ్యంగా చింత చిగురు పులి హోర చేసుకొని తింటే ఆ రుచి వేరే లెవల్‌లో ఉంటుంది.
రుచిని ఇవ్వడమే కాదు ఆయుర్వేదం ప్రకారం చింత చిగురులో ఉండే అనేక రకాల పోషకాలు శరీరానికి చాలా మేలు చేంస్తాయంట.
చింత చిగురులో యాంటీ ఇన్ ఫ్లామెంటరీ గుణాలు ఉంటాయి. అందువలన దీనిని తినడం వలన వాపులు, నొప్పులు,తగ్గడమే కాకుండా పుండ్లు త్వరగా మానతాయి.చర్మ సమస్యలు తగ్గిపోతాయి.
అలాగే చిగురులోని ఫ్లేవనాయిడ్స్, పాలిఫినాల్స్ అనబడే యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. ఇవి ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గిస్తాయి. ఫ్రీ ర్యాడికల్స్‌ను నిర్మూలిస్తాయి. క్యాన్సర్ రాకుండా అడ్డుకోవచ్చు.