మార్నింగ్ లేచిన వెంటనే చెయాల్సిన ఐదు పనులివే!

samatha 

2 april 2025

Credit: Instagram

ఉదయం లేవగానే ఇప్పుడు చాలా మంది స్మార్ట్ ఫోన్ చూస్తున్నారు. కానీ ఇలా చేయకూడదంటున్నారు ఆరోగ్య నిపుణులు.

ఉదయం లేవగానే స్మార్ట్ ఫోన్ చూడటం వలన అనేక సమస్యలు వస్తాయంట. అయితే మార్నింగ్ లేచిన వెంటనే ఐదు పనులు చేస్తే ఆరోగ్యం బాగుంటుందంట. అవి ఏవి అంటే

ఉదయం లేచిన వెంటనే మొదట మీ అరచేతులను మీరు చూసిన తర్వాత, దేవుడికి ధన్యవాదాలు చెప్పుకోవాలంట. దీని వలన పాజిటివ్ ఎనర్జీ వస్తుందంట.

మార్నింగ్ లేవగానే తప్పకుండా మంచినీరు తాగాలంట. దీని వలన మీ శరీరం హైడ్రేటెడ్ గా ఉంటుంది. అనారోగ్య సమస్యలు దరి చేరవు.

అదే విధంగా మార్నింగ్ లేచిన వెంటనే వ్యాయామంతో మీ పనిని ప్రారంభిచాలంట. రోజుకు ఐదు నిమిషాలు వ్యాయమం చేయడం వలన రోగనిరోధక శక్తి పెరుగుతుంది.

అలాగే  చాలా మంది ఉదయం టీ, కాఫీలతో రోజును ప్రారంభిస్తారు. కానీ అలా చేయకూడదంట. ముందు ఆరోగ్యకరమైన టిఫిన్ చేసిన తర్వాతే టీ తాగాలంట.

అదే విధంగా లేచిన తర్వాత అనవసర విషయాల గురించి ఆలోచించకుండా, మీరు ఆ రోజు తప్పకుండా చేయాల్సిన పనులకు సంబంధించి ప్రణాళిక సిద్ధం చేసుకోవాలంట. దీని వలన మనసు ప్రశాంతంగా ఉంటుంది.

అలాగే ఉదయం లేవగానే, ల్యాప్ టాప్, స్మార్ట్ ఫోన్, టీవీ వంటి జోలికి పోకుండా, వీలైనంత వరకు, మీ కుటుంబ సభ్యులతో కాసేపు ప్రశాంతంగా మాట్లాడాలి.