వ్యాయామం చేసిన వెంటనే నీళ్లు తాగాలా.? వద్దా? తెలుసుకోండి
27 June 2025
Pic Credit: freepik.com
TV9 Telugu
వ్యాయామం ఫిట్‌గా ఉండటానికి మాత్రమే కాదు మానసిక, శారీరక ఆరోగ్యానికి కూడా చాలా ముఖ్యం. ఇది శరీరంలో శక్తిని నిర్వహిస్తుంది. రోగనిరోధక శక్తిని బలోపేతం చేస్తుంది. ఒత్తిడిని కూడా తగ్గిస్తుంది.
రోజూ వ్యాయామం చేయడం ద్వారా రక్త ప్రసరణ మెరుగుపడుతుంది. మంచి నిద్ర వస్తుంది. జీవక్రియ వేగంగా జరుగుతుంది. అలాగే మీ బరువు నియంత్రణలో ఉంటుంది. హార్మోన్లు సమతుల్యంగా ఉంటాయి.
వ్యాయామం చేసిన వెంటనే నీరు తాగవచ్చు.. అయితే చల్లటి నీరు తాగకూడదని వైద్యులు చెబుతున్నారు. వ్యాయామం చేసిన 10 నిమిషాల తర్వాత సాధారణ లేదా గోరువెచ్చని నీరు తాగడం మంచిది.
ఇలా గోరువెచ్చని నీరు తాగడం వలన శరీరం నెమ్మదిగా చల్లబడటానికి, రక్త ప్రవాహం సాధారణ స్థితికి రావడానికి సహాయపడుతుంది.
చల్లటి నీరు తాగితే కండరాలను షాక్‌కు గురి చేస్తుంది. జీర్ణవ్యవస్థను కూడా ప్రభావితం చేస్తుంది. తిమ్మిరి లేదా అలసటను పెంచుతుంది. కనుక గోరువెచ్చని లేదా సాధారణ ఉష్ణోగ్రత నీటిని తాగడం మంచిది.
వ్యాయామం తర్వాత 250ml నుంచి 500ml నీరు త్రాగడం మంచిది. అయితే వాతావరణాన్ని దృష్టిలో ఉంచుకుని అవసరాన్ని బట్టి తాగే నీటి పరిమాణాన్నిసర్దుబాటు చేసుకోవాల్సి ఉంటుంది.
ఎక్కువగా చెమటలు పడుతుంటే కొబ్బరి నీళ్లు లేదా ORS వంటి ఎలక్ట్రోలైట్ అధికంగా ఉండే పానీయాలు కూడా తీసుకోవచ్చు. ఇవి శరీరంలోని ఖనిజాలు , ఉప్పు లోపాన్ని భర్తీ చేస్తాయి.
వ్యాయామానికి ముందు, తర్వాత నీరు త్రాగడానికి సరైన పద్దతిని ఏర్పరచుకోండి. ఎక్కువ లేదా చాలా తక్కువ నీరు త్రాగడం రెండూ హానికరం. శరీర అవసరాలను గుర్తించి నీరు తాగి హైడ్రేటెడ్ గా ఉండండి.