రోజూ టీ తాగితే క్యాన్సర్‌కు చెక్.. సర్వేలో షాకింగ్ విషయాలు వెళ్లడి!

11 September 2025

Samatha

టీతాగడం చాలా మందికి ఇష్టం. ఒకప్పటితో పోలీస్తే ఈ రోజుల్లో టీ తాగే వారి సంఖ్య  రోజు రోజుకు చాలా  తగ్గిపోతుంది.

అతిగా, టీ తాగడం వలన అనేక సమస్యలు వస్తాయి, టీ తాగకూడదను అని చాలా మంది అసలు టీని తాగడమే మానేస్తున్నారు.

కానీ తాజాగా ఓ పరిశోధనలో షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి. టీలు తాగడం వలన గుండె సమస్యలు, క్యాన్సర్ వంటివి తగ్గుతాయంట.

తాజా ఆధ్యాయనాల ప్రకారం రోజుకు కనీసం రెండు నుంచి మూడు కప్పుల గ్రీన్ టీ లేదా బ్లాక్ టీ తాగే వారికి క్యాన్సర్ రిస్క్ చాలా తక్కువంట.

ముఖ్యంగా గ్రీన్ టీ తాగడం ఆరోగ్యానికి చాలా మంచిదని, దీని వలన గుండె ఆరోగ్యం బాగుండటమే కాకుండా చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తుందంట.

ప్రతి రోజూ గ్రీన్ టీ లేదా, బ్లాక్ టీ తాగడం వలన అధిక రక్తపోటు తగ్గుంతుంది, అలాగే చెడు కొలెస్ట్రాల్ కరిగిపోయి, రక్తనాళాలు శుభ్రపడతాయంట.

దీంతో గుండెపోటు, స్ట్రోక్ రిస్క్ చాలా తక్కువగా ఉంటుందని చెబుతున్నారు ఆరోగ్యనిపుణులు. అలాగే మధుమేహ రోగులకు కూడా ఇది వరం.

గ్రీన్ టీ లేదా బ్లాక్ టీ తాగడం వలన ఇది రక్తంలోని చక్కెర స్థాయిలను నియంత్రించడంలో కీలక పాత్ర పోషిస్తాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.