బీకేర్ ఫుల్ : ఎవరు దానిమ్మ తినడం ప్రమాదకరమో తెలుసా?
Samatha
31 october 2025
దానిమ్మ ఆరోగ్యానికి చాలా మంచిది. ఇందులో పొటాషియం, కాల్షియం, ఫోలెట్ , మెగ్నీషియం వంటి యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి.
ముఖ్యంగా రక్త హీనత సమమస్యతో బాధపడే వారికి ఇది వరం అని చెప్పాలి. ఎవరైతే రక్తహీనతతో బాధపడుతున్నారో, వారు ప్రతి రోజూ దానిమ్మతినడం వలన రక్తం పెరిగే ఛాన్స్ ఉంది.
అంతే కాకుండా దానిమ్మను ప్రతి రోజూ తినడం వలన రోగనిరోధక శక్తి పెరుగుతుంది. అలాగే ఇది శరీరానికి తక్షణ శక్తిని అందిస్తుంది.
అందువలన దానిమ్మను ప్రతి రోజూ క్రమం తప్పకుండా తినడం వలన అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయని చెబుతారు ఆరోగ్య నిపుణులు.
అయితే దానిమ్మ ఆరోగ్యానికి చాలా మంచిది అయినప్పటికీ, కొన్ని రకాల అనారోగ్య సమస్యలు ఉన్నవారు మాత్రందీనిని అస్సలే తినకూడదంట, వారు ఎవరంటే?
ఎవరైతే మలబద్ధకం, గ్యాస్ సమస్యలతో బాధపడుతారో వారు అస్సలే దానిమ్మ తినకూడదంట, దీని వలన సమస్య మరింత తీవ్రతరం అయ్యే ఛాన్స్ ఉన్నదంట.
అదే విధంగా, మారుతున్న వాతావరణం ,జలుబు, ఫ్లూ వంటి సమస్యలకు కారణం అవుతుంది. అందువలన ఈ సమస్యలు ఉన్న వారు కూడా దానిమ్మ తినకూడదంట.
వాంతులు విరేచనాల సమస్యలతో బాధ పడుతున్నవారు కూడా దానిమ్మకు ఎంత దూరం ఉంటే అంత మంచిదని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు.