పాములంటే చాలా మందికి భయం ఉంటుంది. వీటిని చూస్తే చాలు పారిపోతారు, ముఖ్యంగా కొన్ని పాములు కాటు చాలా ప్రమాదకరంగా ఉంటుంది.
ప్రపంచంలో ఎన్నో రకాల జాతుల పాములు ఉన్నాయి, అందులో కొన్ని ప్రమాదకర పాములు కూడా ఉన్నాయి, అయితే ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకర పాములు ఏవో చూద్దాం.
పాముల్లో అతి పెద్ద పాము అయిన డైమండ్ బ్యాక్ రాటిల్ స్నేక్ చాలా ప్రాణాంతకమైనదంట. ఇది చాలా విషపూరితమైన కాటు వేస్తుందని చెబుతున్నారు నిపుణులు.
అదే విధంగా, ఫెర్ డి లాన్స్ పాము కూడా చాలా ప్రమాదకరం అయినది, ఇది కాటు వేస్తే, రక్త స్రావం అధికంగా అయ్యి, చాలా త్వరగా ప్రాణాలు కోల్పోతారంట.
ఇక ఐరోపాలో ఉండే, ముక్కు కొమ్ము గడల వైపర్ పాము కూడా అత్యంత ప్రమాదకర పాముల్లో ఒకటి, ఇది చాలా విషపూరితమైనదంట. దీని కాటు చాలా నొప్పిని ఇస్తుంది.
ఆఫ్రీకాలో చాలా వేగంగా పాకే, పఫ్ అడ్డర్ చాలా ప్రమాదకరమైనదంట. ఇది కాటు వేస్తే చాలా త్వరగా మరణం సంభవిస్తుందంట, దీని విషపు చుక్క చాలా మంది ప్రాణాలు తీస్తుందంట.
సా స్కేల్డ్ వైపర్ ఇది చాలా చిన్న పాము కానీ, ఆసియాలోనే అత్యంత ప్రమాదకరమైన పాముల్లో ఇది ముందుంటుంది. దీని వలన ప్రతి సంవత్సరం చాలా మంది ప్రాణాలు కోల్పోతున్నారంట.
ఆస్ట్రేలియాలో కింగ్ కోబ్రా చాలా ప్రమాదకరమైనది, ఇది దూకుడు స్వభావం కలిగినదంట. అంతే కాకుండా దీని కాటు చాలా విషపూరితం అని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు.