పాములు ఎక్కువగా చిత్తడి ప్రదేశాల్లో ఉంటాయి. ఇక వీటిని చూస్తే చాలు భయపడని వారు ఎవరూ ఉండరూ, చాలా మంది పామును చూస్తే వణికిపోతుంటారు.
ఇక ఇవి ఇంటి ఆవరణంలో కనిపిస్తే చాలు వారం రోజుల వరకు పాము అక్కడే ఉందని ఫీలైపోయి, భయానికి లోను అవుతుంటారు.
అయితే చాలా మందికి పాములు అంటే చాల భయం కానీ, వీటికి సంబంధించిన ప్రతి ఇన్ఫర్మేషన్ చాలా ఇంట్రెస్ట్‌గా తెలుసుకుంటారు. కాగా, మీ కోసం ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్.
ఎండాకాలం వస్తే చాలు పాములు ఎక్కువగా ఉక్కపోత భరిచలేక బయట తిరుగుతుంటాయి. మరి చలికాలంలో ఇవి ఎక్కువగా ఎక్కడుంటాయి అనే డౌట్ ఉంటుంది.
అయితే చలి కాలంలో పాములు వాటి శరీర ఉష్ణోగ్రతను స్వయంగా నియంత్రించుకోలేవంట. ముఖ్యంగా వాతావరణం చాలా చల్లగా ఉన్నప్పుడు తమను తాము రక్షించుకోవడానికి ఎక్కువ ప్రయత్నం చేస్తాయంట.
చలికాలంలో తమను తాము రక్షించుకోవడానికి పాములు ఎక్కువగా, బ్రూమేషన్, నిద్రాన స్థితిలోకి వెళ్తాయంట. శ్వాస రేటు తగ్గిపోవడంతో, ఆహారం లేకుండా ఎక్కువ రోజులు బతకడానికి ఇది ఉపయోగపడుతుంది.
అయితే చలికాలంలో ఇవి ఎక్కువగా,గోరు వెచ్చగా ప్రదేశాలను వెతుక్కుంటాటయంట. ముఖ్యంగా రాళ్ల కింద, భూమిలోపల, పాత పుట్టలు, ఎలుకల బొరియలను ఆవాసంగా చేసుకుంటాయి.
అంతే కాకుండా పగిలిన ఇంటి గోడలు, పగిలిన పైపులు, ఇంటి పరిసరాల్లో ఉన్న రాళ్లు, చెత్తా చెదారం, వాడని వస్తువుల కింద, పాత కలప రాయి, ఇండి గోడల పగుళ్లలో తలదాచుకుంటాయంట.