ఫస్ట్ నైట్‌కు మల్లెపూలకు ఉన్న సంబంధం ఏంటో తెలుసా? పెద్ద రీజనేరో బాబోయ్!

Samatha

15 November 2025

మొదటి రాత్రి అంటే చాలు అందరికీ ముందుగా గుర్తుకు వచ్చేది మల్లె పూలు మాత్రమే. ఈ రోజున మల్లెపూలతో గదిని అందంగా అలంకరిస్తారు.

అయితే ఎన్నో రకాల పూలు అందుబాటులో ఉండగా, చాలా మంది మొదటి రాత్రి రోజున మల్లెపూలతో మాత్రమే గదిని ఎందుకు అందంగా అలంకరిస్తారు అనే డౌట్ చాలా మందిలో ఉంటుంది.

కాగా, ఇప్పుడు మనం ఫస్ట్ నైట్‌కు, మల్లె పూలకు మధ్య ఉన్న సంబంధం ఏంటి? అసలు మొదటి రాత్రి రోజూ మల్లెపూల ప్రత్యేకత ఎందుకో తెలుసుకుందాం.

మల్లెపూలకు శరీరాన్ని చల్లబరిచే గుణం ఉంటుంది. అందువలన మొదటి రాత్రి రోజున వీటిని తలలో పెట్టుకోవడం వలన ఇవి తల నుంచి శరీరం వరకు వేడిని గ్రహిస్తాయి.

మల్లెపూలతో నూతన వధూ వరుల గదిని అలంకరించడం వలన ఇది భార్య భర్తల మధ్య బంధాన్ని పెంచడమే కాకుండా, సువాసన మనసుకు ప్రశాంతతను ఇస్తుందంట.

మల్లె పూల వాసన పదే పదే పీల్చడం వలన ఇది ఆనందాన్ని ఇస్తుంది.  పడగక గదిని వీటి సువాసన రిఫ్రెష్ చేస్తుందంట.

అమ్మాయిలకు పూలు అంటే చాలా ఇష్టం ఉంటుంది. అంతే కాకుండా మల్లె పూలు వధువు అందాన్ని పెంచడమే కాకుండా ఆరోగ్య ప్రయోజనాలను కూడా ఇస్తుంది.

అలాగే చాలా రకాల పూలు ఉన్నప్పటికీ అవి ఎక్కువగా పూజకు ఉపయోగిస్తారు, వీటిని ఎక్కువగా పూజలకు ఉపయోగించరు కాబటటి, నవ వధువును ఈ పూలతో అలంకరిస్తారంట.