ఓరీ దేవుడో.. బియ్యంతో ఇన్నిప్రయోజనాలా.. ఇప్పటి వరకు తెలియక పాయే..

samatha 

23 MAY 2025

Credit: Instagram

బియ్యం అందరికీ తెలిసినవే. ప్రతి ఒక్కరి ఇంట్లో ఇవి తప్పకుండా ఉంటాయి. అయితే వీటితో బోలెడు ప్రయాజాలు ఉన్నాయంట.

బియ్యాన్ని మనం రైస్ వండుకోవడానికే కాకుండా అనేక రకాలుగా ఉపయోగించుకోవచ్చునంట. అవి ఏవో ఇప్పుడు తెలుసుకుందాం.

బియ్యం నీటితో ముఖాన్ని శుభ్రపరుచుకోవడం వలన చర్మం నిగారింపుగా తయారు అవుతుందంట.అలాగే వీటిని గ్రైండ్ చేసి స్క్రైబ్‌గా కూడా ఉపయోగింవచ్చునంట.

అలాగే బియ్యాన్ని పులియబెట్టిన నీటిని జుట్టుకు పట్టించి పది నిమిషాల పాటు ఉంచాలి. వారం రోజులు ఇలా చేయడం వలన జుట్టు ఒత్తుగా,చుండ్రు తగ్గుతుందంట.

బియ్యంలో అనేక పోషకాలు ఉంటాయి. అందువలన వీటిని తోటల్లో చల్లుకోవడం వలన ఇవి మొక్కలు బాగా పెరగడానికి ఉపయోగపడుతాయంట.

అంతే కాకుండా బియ్యం వస్తువులు తుప్పు పట్టకుండా కూడా చేస్తాయంట. ఇనుప వస్తువుల తేమ గ్రహించడం వలన అవి పాడవకుండా ఉంటాయంట.

బియ్యం ఎయిర్ ఫ్రెషర్‌గా పని చేస్తాయంట. వీటిని దుర్వాసన  వచ్చే బూట్లు, అల్మారాలు, ఫ్రిజ్‌ల్లో పెట్టడం వలన వాసన పోతుందంట.

అలాగే కొంచెం బియ్యాన్ని వేడి చేసి ఒక గుడ్డలో చుట్టి  మీకు కీళ్ల నొప్పులు ఉన్న దగ్గర మసాజ్ లా చేసుకోవడం వలన నొప్పుల నుంచి ఉపశమనం కలుగుతుందంట.