చికెన్ తాజాగా ఉందని ఎలా గుర్తించాలో తెలుసా?

samatha 

27 MAY 2025

Credit: Instagram

చికెన్ అంటే ఇష్టపడని వారు ఎవరు ఉంటారు చెప్పండి. చాలా మంది ఎంతో ఇష్టంగా చికెన్ కర్రీ, చికెన్ బిర్యానీ తింటుంటారు.

ఇక సండే వస్తే ప్రత్యేకంగా చెప్పాల్సిన పనే లేదు. ఆరోజు సంతోషంగా  ఫ్యామిలీ మెంబర్స్‌తో ఎంజాయ్ చేయడమే కాకుండా తప్పకుండా మాంసాహారంతో భోజనం చేస్తారు.

ఇక ఈరోజు చికెన్ షాప్‌ల ముందు చికెన్ ప్రియులు బారులు తీరుతారు.కొందరు మటన్, ఫిష్ తినడానికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తే చాలా మంది చికెన్‌కే ప్రియారిటీ ఇస్తారు.

అయితే చికెన్ కొనుగోలు చేసే ముందు తప్పకుండా కొన్ని విషయాల్లో జాగ్రత్త వహించాలంట. ముఖ్యంగా చికెన్ తాజాదో కాదో తెలుసుకోవాలంట.అది ఎలా అంటే?

చికెన్ నిజంగా తాజాగా ఉంటే, పైభాగం మంచి గులాబీ రంగులో ఉంటుంది.అలాగే ఎరుపురంగులో మాంసం ఉన్నా, అది తాజా చికెన్ అనిఅర్థం.

అలా కాకుండా చికెన్ పచ్చగా ఉంటే, అది చెడిపోయిన మాంసం, కాబట్టి దానిని కొనకుండా ఉండాలి. కొన్నిసార్లు, కోళ్లను కొట్టి దాన్ని స్టోర్ చేయడం వలన దాని రంగు మారుతుందంట.

కొన్ని సార్లు కోడి ఈకలు తీసేసి దాన్ని స్టోర్ చేస్తారు. ప్రెష్ కోడిలా దాన్ని కట్ చేసి ఇస్తారు. అలాంటి సమయంలో కోడిని ఒకసారి తాకి చూడాలంట. దాని బట్టి అది తాజాదా కాదా తెలుస్తుంది.

మీరు కోడిని తాకినప్పుడు మెత్తగా, విరిగిపోయినట్లు కనిపిస్తే అది తాజా చికెన్ కాదు అని అర్థం. కోడిని ముట్టుకున్నప్పుడు అది కాస్త గట్టిగా అనిపిస్తే తాజాగా కోడి అని అర్థం అంట.