బొప్పాయి పండు ఆరోగ్యానికి చాలా మంచిది. అందుకే చాలా మంది దీనిని తినడానికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు. కానీ దీని వలన నష్టాలు కూడా ఉన్నాయంట.
బొప్పాయి పండును తరచూ తినడం వలన అనేక అనారోగ్య సమస్యలు చుట్టుముట్టే అవకాశం ఉన్నదంట. కాగా, అవి ఏవో ఇప్పుడు తెలుసుకుందాం.
మహిళలు తరచూ బొప్పాయి పండు తినడం వలన గర్భస్రావం అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుందంట. అందుకే ప్రెగ్నెంట్ ఉన్నవారు దీనిని తినకపోవడమే మంచిది.
బొప్పాయిని ప్రతి రోజూ తినడం వలన రంగు మారే సమస్య ఉన్నదంట. కాళ్లు చేతులు పచ్చగా మారి, కామెర్ల లక్షణాల మాదిరి మారుతాయంట.అందుకే అతిగా తినకూడదు.
బొప్పాయి పండులో ఎక్కువ మొత్తంలో పపైన్ ఉంటుంది. అందువలన దీనిని ఎక్కవగా తీసుకోవడం వలన ఇది శ్వాస సమస్యలను తీసుకొస్తుంది. ఊపిరి ఆడకపోవడం వంటివి ఎదురవుతాయి.
బొప్పాయి పండు అధికంగా తినడం వలన ఇందులో ఉండే ఖనిజాలు మూత్రపిండాల్లో రాళ్లకు కారణం అవుతాయి. అందువలన కిడ్నీ సమస్యతో బాధపడే వారు దీనిని అతిగా తినకూడదంట.
బొప్పాయి పండులో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. అందువలన దీనిని ఎక్కవగా తీసుకోవడం వలన ఇది కడుపులో చికాకు, అలాగే విరేచనాల వంటి సమస్యలు తీసుకొస్తుంది.
పాలిచ్చే తల్లులు బొప్పాయి తినకూడదంట. కొంత మంది పాల స్రావం పెరుగుతుంది అంటారు కానీ దీనిని ఎక్కువగా తినడం వలన అనారోగ్య సమస్యల బారినపడాల్సి వస్తుందంట.