బ్లాక్ బెర్రీస్ తినడం వలన అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయంటున్నారు ఆరోగ్య నిపుణులు అవి ఏవో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
బ్లాక్ బెర్రీస్‌లో యాంటీఆక్సిడెంట్ల పుష్కలంగా ఉంటాయి. అలాగే వీటిలో ఫ్లేవనాయిడ్లు, విటమిన్ C వంటి పదార్థాలు, శరీరంలోని హానికరమైన ఫ్రీ రాడికల్స్‌ను నివారించడంలో సహాయపడతాయి.
బ్లాక్ బెర్రీస్‌లో ఉండే యాంటీఆక్సిడెంట్లు , ఫైబర్ గుండె ఆరోగ్యానికి చాలా మంచివి. రక్త ప్రసరణను మెరుగు పరుస్తాయి.
బ్లాక్ బెర్రీస్‌లో విటమిన్ C పుష్కలంగా ఉండటం వల్ల జీర్ణక్రియ మెరుగవుతుంది. వీటిలో ఉన్న ఫైబర్ పేగులను ఆరోగ్యంగా ఉంచడమే కాకుండా, మల బద్ధక సమస్య నుంచి ఉపశమనం ఇస్తుంది
బ్లాక్ బెర్రీస్‌లో విటమిన్ K పుష్కలంగా ఉంటుంది. ఇది ఎముకల ఆరోగ్యానికి అవసరమైన ఖనిజాలను అందుస్తుంది. ఎముకలను దృఢంగా చేస్తుంది.
బ్లాక్ బెర్రీస్‌లో ఉండే యాంటీఆక్సిడెంట్లు మెదడు కణాల క్షీణతను తగ్గించడంలో సహాయపడతాయి. ఇవి నాడీ వ్యవస్థను రక్షించి మెమోరీ పవర్ పెరిగేలా చేస్తాయి.
బ్లాక్ బెర్రీస్ క్యాన్సర్ నివారించడంలో కూడా దోహద పడుతుంది. ఇందులో ఉండే యాంటీ ఇన్ ప్లమెంటరీ లక్షణాలు క్యాన్సర్ కణాల ఎదుగుదలను అడ్డుకుంటాయి.
బ్లాక్ బెర్రీస్ గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువగా కలిగి ఉంటాయి, అంటే ఇవి రక్తంలో చక్కెర స్థాయిలను వేగంగా పెంచవు. అలాగే వీటిలో ఉండే పీచు పదార్థం రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రిస్తాయి.