భారతదేశంలో ఒకే ఒక రాష్ట్రంలో లభించే ఈ మామిడి పండు గురించి తెలుసా?

samatha 

25 MAY 2025

Credit: Instagram

పండ్లలో మామిడి పండును పండ్ల రాజు అని పిలుస్తారు. ఈ మామిడి పండ్లను చాలా మంది ఎంతో ఇష్టంగా తింటుంటారు.

ఈ మామిడి పండ్లు కూడా అనేక రకాలు ఉంటాయి. కానీ మన భారత దేశంలో ఒకే ఒక రాష్ట్రంలో పండే మామిడి పండు తినాలి అంటే పెట్టి పుట్టాలంట.

దాని రుచికి ఎవ్వరైనా ఫిదా అవ్వాల్సిందేనంట.ఇంతకీ అది ఏ మామిడి? అది ఎక్కడ పండిస్తారనేగా మీ డౌట్. ఇప్పుడు దాని గురించే తెలుసుకుందాం.

భారతదేశంలో అనేక రకాల మామిడి పండ్లు పండుతాయి. ముఖ్యంగా దేశంలో ఒకే ఒక రాష్ట్రంలో ఎరుపు రంగులో ఉండే మామిడి పండ్లను పండిస్తారు.

వాటి పేరు మియాజాకి మామిడి పండ్లు. ఇది ప్రకాశవంతమైన రూబీ ఎరుపు రంగుతో ఉంటాయి. అంతే కాకుండా వీటి రుచి కూడా చాలా అద్భుతంగా, తియ్యగా ఉంటుందంట.

అత్యంత ఖరీదైన మామిడి పండ్లలో మియాజాకి మామిడి పండ్లు ఒకటి. ఈ ఒక్క పండుకు రూ.100 వరకు అమ్ముడు పోతుందంట. కిలోకు రూ.3 లక్షల వరకు ఉంటుందంట.

బీహార్ రాష్ట్రంలో పండే ఈ మామిడి పండ్లు మంచి రుచిని, అలాగే ఈ ఒక్క పండు బరువు దాదాపు 550 గ్రాముల ఉండటంతో ధర అనేది చాలా ఎక్కువ.

ఈ రకం మామిడి పండ్లను బిహార్‌లోని పాట్నా జిల్లాలోని మసౌర్హి బ్లాక్ లో ఉన్న కొరియవన్ గ్రామంలో మాత్రమే సాగు చేస్తారంట. దీనిని సూర్యుని పండుగా పిలుస్తారంట.