చాణక్య నీతి : మీ జీవితాన్ని మార్చే ఏడు నియమాలు ఇవే!
Samatha
12 November 2025
ఆ చార్య చాణక్యుడు గొప్పపండితుడు. ఆయన నేటి తరం వారికి ఉపయోగపడే ఎన్నో విషయాలను తెలియజేశారు వాటి గురించి మనం వివరంగా తెలుసుకుందాం.
అలాగే ఒక వ్యక్తి జీవితంలో గొప్పగా ఎదగాలంటే తప్ప కుండా కొన్ని నియమాలు పాంటిచాలని చెబుతున్నాడు చాణక్యుడు అవి ఏవో ఇప్పుడు మనం తెలుసుకుందాం .
ఒక వ్యక్తి జీవితంలో ఎదగాలి అంటే విద్య అనేది తప్పని సరి. ఒక వ్యక్తి నిజమైన సంపద విద్య. అయితే ఏ వ్యక్తి అయితే విద్య సరిగ్గా అభ్యసిస్తారో వారు జీవితంలో గొప్ప స్థాయిలో ఉంటారు.
మంచి స్నేహితులు కూడా ప్రతి వ్యక్తికి అవసరం. అందువలన ఒక మంచి స్నేహితుడు వంద పుస్తకాలతో సమానం అంటారు. అందుకే మంచి స్నేహితుడు తప్ప కుండా ఉండాలంట.
ఎప్పుడూ కూడా ఒక వ్యక్తి జీవితంలో గొప్పగా ఎదగాలి అంటే తప్పకుండా తమ భవిష్యత్తు ప్రణాళికలు ఇతరులతో చెప్పకూడదంట. చెబితే సమస్యలు ఎదురు అవుతాయి.
ఆ చార్య చాణక్యుడు సోమరితనమే ఒక వ్యక్తి అతి పెద్ద శత్రువు అని చెబుతున్నాడు. సోమరిగా ఉన్న వ్యక్తి జీవితంలో ఏం సాధించలేడంట. అందుకే సోమరితనంగా ఉండకూడదు.
కష్టమే మీ జీవితాన్ని మార్చుతుంది. అందుకే ఏ వ్యక్తి అయినా సరే తాను చేయాలి అనుకుంటున్న పనిలో తప్పకుండా సక్సెస్ కావాలి అంట, అప్పుడే నిజమైన విజయం దక్కుతుంది.
అబద్ధం అనేది అస్సలే మంచిది కాదు. అందుకే ఏ వ్యక్తి అయినా సరే తమ జీవితంలో అస్సలే అబద్ధం చెప్పకూడదంట. ఇది చాలా సమస్యలకు కారణం అవుతుంది.