చాణక్యనీతి : లక్ష్మీదేవి ఉండటానికి ఇష్టపడని వ్యక్తులు వీరే..వీరు ఎప్పటికీ పేదవారే!
samatha
17 JUN 2025
Credit: Instagram
ఆ చార్య చాణక్యుడి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఆయన గొప్పపండితుడు, తత్వవేత్త. అనేక విషయాల గురించి వివరంగా తెలియజేశాడు.
అయితే ఆ చార్య చాణక్యుడు తన జీవితంలోని అనుభవాల ఆధారంగా అనేక అంశాల గురించి తెలియజేసిన విషయం తెలిసిందే.
కాగా, చాణక్యడు డబ్బుకు సంబంధించి కూడా అనేక విషయాలు తెలియజేశాడు. ఈ క్రమంలోనే కొంత మంది వద్ద లక్ష్మీదేవి ఉండదు అని చెప్పుకొచ్చాడు.
కొంత మంది తెలిసి తెలియ చేసిన కొన్ని తప్పుల వలన పేదవారిగా మారడమే కాకుండా ఆర్థిక సమస్యలు ఎదుర్కొంటారన్నారు. వారెవరంటే?
ఆ చార్య చాణక్యుడి ప్రకారం ఏ వ్యక్తి అయితే పేద వారిని వేధిస్తాడో, వారికి కనీసం ఒక్కపూట భోజనం పెట్టడానికి ఇష్టపడడో, అతనిపై లక్ష్మీదేవి చాలా కోపంగా ఉంటుందంట.
ఇంటికి దీపం మహిళ. అయితే అలాంటి మహిళలను ఎవరైతే వేధిస్తారో, బాధపెడుతారో వారిపై లక్ష్మీదేవి కోపంగా ఉండటమే కాకుండా ఇంటి నుంచి వెళ్లిపోతుందంట.
బ్రహ్మణులను ఎప్పుడూ గౌరవించాలి. అయితే ఎవరైతే బ్రాహ్మణులను ద్వేషిస్తారో,ధూషిస్తారో వారు పేదవారు అవుతారంటున్నాడు ఆచార్య చాణక్యుడు.
అదే విధంగా పెద్దలను, సాధువులను, గురువులను ఎప్పుడూ గౌరవించాలి. కానీ కొందరు వారిని అవమానిస్తారు. అయితే పెద్దవారిని అవమానించే వారి వద్ద లక్ష్మీ దేవి ఉండదంట.