చాణక్యనీతి : జీవితంలో ప్రతి వ్యక్తి తెలుసుకోవాల్సిన 10 పచ్చినిజాలు ఇవే!

samatha 

05 JUN  2025

Credit: Instagram

ఆచార్య చాణక్యుడు చాలా విషయాలను తెలియజేశాడు. అయితే మీ మనసు ఒప్పుకోకపోయినప్పటికీ కొన్ని విషయాలు అనేవి పచ్చి నిజాలంటున్నాడు చాణక్యుడు. అవి

ఆచార్య చాణక్యుడు ఒక వ్యక్తి అస్సలే నిజాయితీగా ఉండకూడదు అని చెబుతున్నాడు. ఎందుకంటే నిటారుగా ఉన్న చెట్లనే ముందుగా నరికివేస్తారు. ఇదే నిజం అంట.

అలాగే కుటుంబం అంటే ఇష్టం ఉంటుంది. కానీ కుటుంబ సభ్యులపై అతి ప్రేమ ఉన్న వ్యక్తి నిరంతరం భయం, దు:ఖాన్ని అనుభవించక తప్పదంట.

ప్రపంచంలో అతి పెద్ద శక్తి ఏదైనా ఉన్నదా అంటే అది స్త్రీ యవ్వనం, అందంమే అంటున్నాడు ఆచార్య చాణక్యుడు. దీనికి మించిన శక్తి లేదంట.

స్నేహానికి మించిన బంధం లేదు కానీ, ప్రతి స్నేహం వెనుక కొంత స్వార్థం ఉంటుంది అనేది పచ్చి నిజం అంటున్నాడు ఆచార్య చాణక్యడు.

కర్తవ్యంలో సేవకుడిని, కష్టంలో ఉన్న బంధువును, కష్టాల్లోని స్నేహితుడిని, దురదృష్టంలో ఉన్న భార్యను అస్సలే పరీక్షించకూడదంటున్నాడు చాణక్యుడు.

మీరు ఏదైనా పని ప్రారంభించే ముందు తప్పకుండా మీకు మీరే మూడు ప్రశ్నలు వేసుకోవాలంట. ఎందుకు? ఎందుకు కాదు? చేస్తే ఏం లాభం.

బంధాలనై, బంధుత్వాలైనా డబ్బుతోనే ముడిపడతాయి అంటున్నాడు ఆచార్య చాణక్యుడు. డబ్బుతో పాటు మనుషులు కూడా మారిపోతారంట.