ఖాళీ కడుపుతో ఆపిల్ తినవచ్చా?
Samatha
6 November 2025
ఆపిల్ ఆరోగ్యానికి చాలా మంచిది. రోజుకు ఒక ఆపిల్ తింటే డాక్టర్ అవసరం లేదు అని చెబుతారు ఆరోగ్య నిపుణులు. అందుకే చాలా మంది ఆపిల్స్ ఎక్కువ తింటారు.
ఇక ఆపిల్ పండులో విటమిన్స్, మినరల్స్ , యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉండటం వలన ఇవి శరీరానికి చాలా మేలుచేస్తుంది.
అయితే చాలా మందిలో ఉండే అతి పెద్ద డౌట్ ఏమిటంటే. ఖాళీ కడుపుతో ఆపిల్ తినడం మంచిదేనా? కాగా, ఇప్పుడు మనం దాని గురిం
చి తెలుసుకుందాం.
ఖాళీ కడుపుతో ఆపిల్ తినడం మంచిదే అంటున్నారు నిపుణులు, ముఖ్యంగా, ఇది జీర్ణక్రియను మెరుగు పరిచి, మలబద్ధకం సమస్యను తగ్గిస్తుంది.
ప్రతి రోజూ ఖాళీ కడుపుతో ఆపిల్ తినడం వలన ఇది ఆకలిని నియంత్రించడమే కాకుండా, అధిక బరువుతో బాధపడుతున్నవారు, బరువు తగ్గడానికి సహాయ
పడుతుంది.
అలాగే, గుండె ఆరోగ్యానికి ఆపిల్ పండు చేసే మేలు ఎంత చెప్పినా తక్కువే, ఇది గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గించడంలో కీలకంగా వ్యవహరిస్తుంది.
అదే విధంగా, ప్రతి రోజూ ఉదయం, ఖాళీ కడుపుతో ఆపిల్ తినడం వలన ఇది చర్మాన్ని నిగారింపుగా తయారు చేసి, ఆరోగ్యాన్ని రక్షిస్తుంది.
అంతే కాకుండా ఖాళీ కడుపుతో ఆపిల్ పండు తినడం వలన ఇది జుట్టు రాలే సమస్యను తగ్గించి, జుట్టు ఒత్తుగా పెరిగేలా చేస్తుంది.
మరిన్ని వెబ్ స్టోరీస్
కివీ శరీరానికి చేసే మేలు ఇదే.. తింటే ఎన్ని లాభాలో..
పెళ్లి ఎందుకు చేసుకోవాలో తెలుసా?.. మైండ్ బ్లోయింగ్ ఆన్సర్ ఇదే!
చాణక్య నీతి : ఇలాంటి భర్తను వదిలేసినా పాపం లేదు!