జ్వరం వచ్చినప్పుడు గుడ్లు తినొచ్చా లేదా.. అసలు నిజం ఏంటి?

09 July 2026

Anand T

గుడ్లు మన ఆరోగ్యానిక మేలు చేస్తాయని అందరికి తెలుసు. కానీ చాలా మంది జ్వరం వచ్చినప్పుడు గుడ్లు తినవద్దు అంటారు. ఇందులో నిజం ఏంతా అనేది ఇప్పుడు తెలుసుకుందాం.

గుడ్లు

గుడ్లలో మన బాడీకి కావాల్సిన అనేక పోషకాలు ప్రోటీన్ పుష్కలంగా ఉంటాయి. ఇది బరువు తగ్గడానికి, కండరాల పెరుగుదలకు సహాయపడుతుంది.

ప్రోటీన్

జ్వరం ఉన్నప్పుడు గుడ్లు తినకూడదనే అపోహ చాలా మందిలో ఉంది. కానీ జ్వరం సమయంలో కూడా గుడ్లు తినవచ్చని నిపుణులు చెబుతున్నారు.

తినడం మంచిదే

జ్వరంతో వచ్చినప్పుడు గుడ్లు తినకూడదనడానికి, తింటే హాని కలుగుతుందని ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవు.

శాస్త్రీయ ఆదారం

జ్వరం ఉన్నప్పుడు బాగా ఉడికించిన గుడ్లను మాత్రమే తినాలని.. అది కూడా రోజుకు రెండుకు మించి తినకూడదని నిపుణులు చెబుతున్నారు.

రోజుకు రెండు

జ్వరంలో గుడ్లు తినడం వల్ల శరీరానికి కావాల్సిన ప్రోటీన్ అందుతుదని.. తద్వారా శరీరం త్వరగా కోలుకోలుకుంటుందని నిపుణులు చెబుతున్నారు.

తక్షణ శక్తి

జ్వరం సమయంలో గుడ్లు తింటే కొందరికి వికారం, వాంతులు కావచ్చు. అలాంటి వారు గుడ్లు తినడం మానేయడం మంచిది.

అలర్జీ

మీకు ఇతర ఆరోగ్య సమస్యలు ఏవైనా ఉంటే, జ్వరం సమయంలో గుడ్లు తినే ముందు ఒకసారి వైద్యుడిని సంప్రదించడం ఉత్తమం.

వైద్యుల సలహా