మన దేశంలో సైకిల్ కంటే నెమ్మదిగా నడిచే ట్రైన్ ఇదేనట!

14 Oct 2026

Anand T

ప్రపంచంలోనే 3వ అతిపెద్ద రైల్వే వ్యవస్థ అయిన ఇండియన్ రైల్వేస్‌లో గంటకు 100-120 స్పీడ్‌తో నడినే ట్రైన్స్‌ ఎన్నో ఉన్నాయి.. ఇది అందరికీ తెలుసు!

నిలగిరి రైల్వే

కానీ సైకిల్ వేగం కంటే స్లోగా నడిచే రైలు కూడా ఉందని మీకు తెలుసా? అవును తమిళనాడులోని నీలగిరి మౌంటైన్ రైల్వే చాలా నెమ్మదిగా నడుస్తోందట.

నిలగిరి రైల్వే

ఈ ట్రైన్ గంటకు కేవలం 9 కి.మీ వేగంతోనే నడుస్తోందట. సైకిలైనా గంటకు 10 నుంచి 20 కి.మీ స్పీడ్‌తో పోతుంది.. కానీ ఈ ట్రైన్ దానికంటే స్లో.

నిలగిరి రైల్వే

ఈ ట్రైన్ సాధారణంగా మేట్టుపాళయం నుంచి ఊటీ మధ్య రాకపోకలు సాగిస్తోంది. ఈ రెండు నగరాల మధ్య దూరం జస్ట్ 46 కిలో మీటర్లు మాత్రమే

నిలగిరి రైల్వే

కానీ ఆ 46 కిలోమీటర్ల దూరాన్నే ఈ ట్రైన్ దాదాపు 5 గంటల పాటు ప్రయాణిస్తోంది. ఇందుకు ప్రధాన కారణం.. ఈ ట్రైన్ కొండలు, తీక్షణమైన మలుపుల గుండా ప్రయాణిస్తుంది.

నిలగిరి రైల్వే

ఇది స్లోగా వెళ్లడానికి మరో రీజన్.. ఈ ట్రైన్ వెళ్లే రూట్‌లో ప్రకృతి అందాలు, పచ్చని కొండలు, లోయలు స్వర్గాన్ని తలపిస్తాయి. పర్యాటకులకు ఈ అనుబవాన్ని అందించేందుకే ఈ ట్రైన్ నెమ్మదిగా వెళ్తోంది.

నిలగిరి రైల్వే

అంతేకాదు ఈ రైలు ఏకంగా 1,877 మీటర్ల ఎత్తు వరకు ప్రయాణిస్తుంది.అందుకే ఈ రూట్‌లో ట్రైన్ చాలా నెమ్మదిగా వెళ్తుంది.

నిలగిరి రైల్వే

నిటారు కొండల గుండా ఈ ట్రైన్ రాకపోకలు సాగించేందుకు అధికారులు ర్యాక్ సిస్టమ్ అనే ప్రత్యేక టెక్నాలజీని ఉపయోగిస్తారు.

నిలగిరి రైల్వే