ఉదయం టీ తాగే వారికి షాకింగ్ న్యూస్.. అసలు విషయం ఏమిటంటే?

samatha 

05 JUN  2025

Credit: Instagram

టీ అంటే ఇష్టపడని వారు ఎవరుంటారు చెప్పండి. చాలా మంది ఎంతో ఇష్టంగా ప్రతి రోజూ మార్నింగ్ టీ తాగుతూ ఉంటారు.

కొంత మంది అయితే ఉదయం లేవగానే టీ  లేనిదే ఆరోజే గడవనట్లు ఉంటుంది అని చెబుతుంటారు. అంతలా టీని ఇష్టపడుతుంటారు.

ఇక కొంత మంది రోజుకు ఒకసారి టీ తాగితే మరికొంత మంది రెండు లేదా మూడు సార్లు టీ తాగుతారు. ఇక వర్క్ చేసే వారు ఎక్కువ టీ తాగడానికి ఇష్టపడతారు.

అయితే టీ తాగడం వలన లాభాలు  ఉన్నప్పటికీ, ఉదయాన్నే టీ తాగడం వలన అనేక నష్టాలు ఉన్నాయంటున్నారు ఆరోగ్య నిపుణులు. అవి ఏవి అంటే?

ఉదయాన్నే టీ తాగడం వలన అది కాలేయం పై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తుందని చెబుతున్నారు ఆయుర్వేద వైద్య నిపుణులు. అందుకే మార్నింగ్ టీ తాగకూడదంట.

ఉదయం ఖాళీ కడుపుతో టీ తాగడం వలన అందులోని టానిన్ పేగు ఆరోగ్యాన్ని దెబ్బతీయడమే కాకుండా, కాలేయ వాపు కూడా కారణం అవుతుందంట.

అలాగే ఖాళీ కడుపుతో టీ తాగడం వలన అది జీర్ణసమస్యలకు కారణం అవుతుంది. అంతే కాకుండా  ఫ్యాటీ లివర్ సమస్యలు వచ్చే ప్రమాదం చాలా ఉందని చెప్తున్నారు వైద్యులు.

అందుకే ఉదయాన్నే ఖాళీ కడుపుతో టీ తాగడం కంటే హెర్బల్ టీ తాగడం లేదా, గోరు వెచ్చటి నీరు తాగడం ఆరోగ్యానికి చాలా మంచిదంట.