ప్రతి ఒక్కరి ఇంటిలో తప్పకుండా బెల్లం, చక్కెర అనేవి ఉంటాయి. అయితే వీటిలో ఏది తినడం ఆరోగ్యానికి మంచిదనే డౌట్ చాలా మందిలో కలుగుతుంది.
ఇక బెల్లం, చక్కెర రెండు వేరు వేరు రుచులను కలిగి ఉన్నప్పటికీ ఈ రెండూ కూడా వంటకాల్లో అద్భుతమైన రుచిని అందిస్తాయి. అయితే దీనిలో ఏది తినడం హెల్త్‌కు మంచిదో చూద్దాం.
ఈ మధ్య కాలంలో చాలా మంది చక్కెర వద్దూ బెల్లం తినడం ఆరోగ్యానికి చాలా మంచిదని చెబుతున్నారు? మరి ఎందుకు చక్కెరను బెల్లంతో భర్తీ చేయాలని ఎందుకు చెబుతున్నారో తెలుసుకుందాం.
బెల్లంలో విటమిన్స్, మెగ్నీషియం, పొటాషియం, కాల్షియం, సెలీనియం, మాంగనీస్ వంటివి పుష్కలంగా ఉంటాయి. ఇది ఆరోగ్యానికి చాలా మంచిది.
బెల్లం రోజూ తినడం వలన ఇది రక్తహీనతను తగ్గిస్తుంది. అంతే కాకుండా బెల్లం తయారు చేయడానికి ఎలాంటి రసాయనాలు ఉపయోగించరు. ఇది శరీరానికి తక్షణ శక్తిని ఇవ్వడంలో ముందుంటుంది.
బెల్లం కంటే చక్కెర తక్కువ కేలరీలను కలిగి ఉండటమే కాకుండా, గ్లైసెమిక్ సూచిలు కలిగి ఉంటుంది. ఇది శరీరంలో తక్షణమే శోషించబడుతుంది కానీ, బెల్లం రక్తంలోని చక్కెర స్థాయిలను వేగంగా పెంచదు.
అంతే కాకుండా బెల్లంలో యాంటీ ఆక్సిడెంట్స్, విటమిన్స్, మినరల్స్ ఎక్కువ మోతాదులో ఉండటం వలన బెల్లం తినడం వలన ఇది రోగనిరోధక శక్తిని పెంచుతుంది.
చక్కెర తినడం వలన చాలా త్వరగా బరువు పెరిగే ఛాన్స్ ఉంటుంది. బెల్లం లో పొటాషియం ఎక్కువగా ఉండటం వలన ఇది బరువు త్వరగా పెరిగేలా చేయదు. అందువలన చక్కెర కంటే బెల్లం ఆరోగ్యానికి మంచిదంట.